
మంత్రి పొన్నంను కలిసిన ఆర్టీసీ సంఘాల నేతలు
ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు.
తెలంగాణ ఆర్టీసీలో సమస్యలపై చర్చించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రి పొన్నంను కలిశారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో సమావేశం జరిగింది. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సమస్యల పై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈరోజు ,రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటా అని హామీ ఇచ్చారు.
‘‘ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,కార్మికుల సంక్షేమం ,ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. సమస్యలు తొలుగుతున్నాయి. సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్న. ఆర్టీసీ కి 16 నెలలు గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం..ఒక్కటైన ఇబ్బంది పెట్టమా. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారు. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేశారు.. ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు ,ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదు, ccs,pf పైసలు వాడుకున్నారు. TGSRTC ఉద్యోగులకు 2013 నుండి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించింది’’ అని వివరించారు.
‘‘2017 పే స్కేల్ 21% శాతం ఇచ్చింది సంవత్సరానికి 412 కోట్లు భారం పడుతుంది. పిఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగ పెండింగ్ లో ఉన్న 1039 కోట్లు చెల్లించాం. నెలవారీ PF కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుండి క్రమం తప్పకుండా చెల్లించబడుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ccs బకాయిలు ఉద్యోగులకు 345 కోట్లు రూపాయలు చెల్లించాం. నెలవారీ CCS కంట్రిబ్యూషన్ జనవరి-2024 నుండి క్రమం తప్పకుండా చెల్లించబడుతుంది. 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టినం. ప్రభుత్వం TGSRTCలో 3038 మంది ఉద్యోగులను రిక్రూట్‌మెంట్ చేయడానికి అనుమతి ఇచ్చింది. కొత్త బస్సులు కొనుగోలు చేశాం ,తార్నాక ఆసుపత్రి ను సూపర్ స్పెషాలిటీ గా మార్చాం’’ అని అన్నారు.