అమెరికాలో కూడా ‘ఉచిత’ హామీలకు ఎగబడి ఓట్లేసి గెలిపించిన జనాలు
x
Revanth and Zohran Mamdani

అమెరికాలో కూడా ‘ఉచిత’ హామీలకు ఎగబడి ఓట్లేసి గెలిపించిన జనాలు

రేవంత్ ఉచిత పథకాలనే మమ్ దాని మేయర్ ఎన్నికలో స్పూర్తిగా తీసుకుని కాపీకొట్టిన్నట్లు అర్ధమవుతోంది


ఉచితం అంటేచాలు జనాలు ఎగబడిపోతున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికలో కూడా ఇదే రుజువైంది. విషయం ఏమిటంటే న్యూయార్క్(New York Mayor) నగర మేయర్ ఎన్నికల్లో భారతసంతతికి చెందిన జొహ్రాన్ మమ్ దాని (Zohran Mamdani)బ్రహ్మాండమైన మెజారిటితో గెలిచారు. మాజీ మేయర్ ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్ నేత కర్టిస్ సిల్వను ఓడించారు. వీళ్ళిద్దరిపైన మమ్ దాని గెలవటం కన్నా 50శాతం ఓట్లతో ఘనవిజయం సాధించటమే ఆశ్చర్యంగా ఉంది. మమ్ దానికి జనాలు ఇన్ని ఓట్లేసి ఎందుకు గెలిపించారు ? ఎందుకంటే ఫ్రీ..ఫ్రీ అని ఎన్నికల్లో హామీలు ఇవ్వటంతోనే. 2023 తెలంగాణ(Telangana)అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా (Revanth)ఎనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన అనేక హామీల్లో ఉచిత హామీలు కీలకమైనవి.

ఉచిత హామీల్లో బస్సు ప్రయాణం ఉచితం, పేదలకు 200 యూనిట్లలోపు విద్యుత్ ఛార్జీలు, తులం బంగారం లాంటి ఉచిత హామీలు కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్రను పోషించాయి. ఎంతైనా భారత సంతతి వ్యక్తేకదా మమ్ దాని కూడా తెలంగాణలో అమలవుతున్న ఉచిత హామీల గురించి వినుంటాడు, అధ్యయనం చేసుంటాడు. అందుకనే మేయర్ ఎన్నికల్లో మమ్ దాని ఉచిత హామీలను ప్రకటించాడు. ఇపుడు బస్సుల్లో ఉన్న టికెట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. తెలంగాణలో మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం. కాని న్యూయార్క్ లో ఆడ, మగా అందరికీ ఉచిత ప్రయాణమని మమ్ దాని హామీ ఇచ్చేశాడు. ఉచిత హామీలు ఇవ్వటంలో రేవంత్ కన్నా రెండాకులు ఎక్కువే చదివినిట్లున్నాడు.

ఉచిత బస్సుతో పాటు ఆరువారాల శిశువుల నుండి ఐదేళ్ళ చిన్నారులందరికీ ఉచిత వైద్యం అని కూడా ప్రకటించాడు. అమెరికాలో వైద్యం ఖర్చు చాలా ఖరీదైన విషయం అందరికీ తెలిసిందే. అంతటి ఖరీదైన వైద్యాన్ని పిల్లలకు ఉచితంగా అందిస్తామని అన్నాక జనాలు ఓట్లేయకుండా ఉంటారా ? పనిలోపనిగా పెరిగిపోతున్న ఇళ్ళ అద్దెలను కూడా ఫ్రీజ్ చేస్తానని మరో హామీ కూడా గుప్పించాడు. అలాగే న్యూయార్క్ లో ఇపుడు గంటకు అందుకుంటున్న 16.50 డాలర్ల కనీస వేతనాన్ని 30 డాలర్లకు పెంచుతాననే మరో కీలకమైన హామీనిచ్చాడు. ఇవేకాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గ్రాసరీ స్టోర్స్ ఏర్పాటుచేసి సబ్సిడి ధరల్లో ఆహారం అందిస్తామని ఇంకో హామీ వదిలాడు. ఇన్ని ఉచిత హామీలను, సబ్సిడీ హామీలను అమలు చేయగలడా ? మేయర్ గా ఎన్నికయ్యాడు కదా ఏమిచేస్తాడో చూడాలి.

చూస్తుంటే రేవంత్ ఉచిత పథకాలనే మమ్ దాని మేయర్ ఎన్నికలో స్పూర్తిగా తీసుకుని కాపీకొట్టిన్నట్లు అర్ధమవుతోంది. తాజాఫలితంతో అర్ధమవుతున్నది ఏమిటంటే తెలంగాణ, ఇండియాలోనే కాదు అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఉచితం అంటే జనాలు బ్రహ్మరథం పడట్టడం ఖాయమని. ఉచితాలకు న్యూయార్కులో జనాలు ఇంతగా ఆకర్షితులయ్యారంటే ఆనగరంలో పేదలు పెరిగిపోతున్నారా ? లేకపోతే నిరుద్యోగం పెరిగిపోతోందా ? ఇదీకాకపోతే నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజల కొనుగోలుశక్తి తగ్గిపోతోందా ?

Read More
Next Story