భర్తల దారుణాలు ...భార్యల ఘోరాలు
x

భర్తల దారుణాలు ...భార్యల ఘోరాలు

ఆందోళన రేకెత్తిస్తున్నసమాజంలో వింతపోకడలు


తెలంగాణలో కట్టుకున్న భార్యలను కాటికి పంపే భర్తలు ఎక్కువయ్యారు. కాటికి తీసుకెళ్తే ఖర్చవుతుందనుకుంటున్నారో ఏమోకొందరు భర్తలు ఇంట్లోనే అర్ధాంగిలను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. చివరకు భార్యల అవశేషాలను మూసీ నదిలో పడేసే భర్తలు ఉండనే ఉన్నారు.

మరోవైపు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్నసాకుతో భార్యలు ఏడడుగులు నడిచిన భర్తలను హత్య చేయిస్తున్నారు. సమాజంలో వస్తున్న ఈ విపరీత పోకడలకు కుటుంబంలో పెరిగిన వాతావరణం, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని సైకియాట్రిస్ట్ లు చెబుతున్నారు.

ఈ సంవత్సరం జనవరి చివరివారంలో పదేళ్లు కాపురం చేసి భార్యనుఅత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. శవాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్ లో ఉడకబెట్టి మూసీ నదిలో విసిరేశాడు ఓ రిటైర్డ్ మిలటరీ ఉద్యోగి.

సరిగ్గా ఏడునెలల్లో హైదరాబాద్ బోడుప్పల్ కు చెందిన శాడిస్ట్ భర్త ఆలిని హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి మూసీలో విసిరేశాడు. పై రెండు ఘటనల్లో భార్యల అవశేషాలను మూసీలో విసిరివేయడం కో ఇన్సిడెంట్ అనే చెప్పాలి. సభ్య సమాజం సిగ్గుపడేలా ఈ హత్యలు ఉంటున్నాయి

తాజాగా హైదరాబాద్ బోడుప్పల్ లో ప్రేమించి, పెండ్లి చేసుకున్న భర్తే కాలయముడయ్యాడు. పెళ్లయిన కొన్ని రోజులకే కట్టుకున్న భార్యను కడతేర్చాడు. పెళ్లయినప్పటి నుంచి వేధింపులతోనే భార్యకు నరకం చూపాడు. చివరకు ఐదునెలల గర్భవతి అయిన భార్యను అతి కిరాతకంగా హతమా ర్చాడు, ముక్కలుగా కోసి చివరకు మూసీ నదిలో విసిరేశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు బుకాయించాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ హత్యా ఘటనను ఇది పోలి ఒకే తరహా ఉండటం గమనార్హం. శ్రద్ధావాకర్‌ను ఆమె తోడుగా ఉండే అప్తాబ్‌ గొంతునులిమి హత్య చేశాడు. పాశవికంగా అత్యంత క్రూరంగా మృతదేహాన్ని ముక్కలుగా నరికి, 3వారాలపాటు ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో ఆ శరీర భాగాలను విసిరేశాడు.

ఏడునెలల క్రితం హైదరాబాద్ మీర్‌పేట్‌లో భా ర్యను చంపి, ముక్కలు చేసి శరీర భాగాలను ఉడకబెట్టిన కిరాతక భర్త ఘటననూ ఎవరూమర్చిపోక ముందే ఇలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది.

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని

ఇదిలా వుండగా తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను హత్య చేయించిన ఘటన హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో చోటు చేసుకుంది. గత ఏప్రిల్ లో తన భర్తను కరెంట్ షాక్‌తో చంపేసింది. అనంతరం చెల్లెలి భర్త సహాయంతో మృతదేహాన్ని దాచిపెట్టి సొంతూరు వెళ్లిపోయింది. బంధువుల ఫిర్యాదుతో విషయం బయటపడగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిలు, కవిత దంపతులు కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్నారు. స్థానికంగా ఓ నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌కు వాచ్‌మెన్‌గా పనికి కుదిరారు. కొంతకాలంగా వీరిద్దరూ సపరేటుగా జీవనం కొనసాగిస్తున్నారు.వారిద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నట్లు సమాచారం. కవిత వివాహేతర సంబంధాన్ని సాయిలు ప్రశ్నించాడు. లాభం లేదనుకుని భర్తను హత్య చేయించాలని కవిత డిసైడ్ అయినట్టు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం భర్తను హత్య చేయించినట్టు పోలీసులు తెలిపారు

భర్త సాయిలు పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని కవిత పోలీసులకు చెప్పింది. దీంతో గ్రామంలోని బంధువులు, సన్నిహితులు సాయిలు కోసం వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు కంప్లైట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు విచారణ చేస్తే భార్య కవితే అతడిని హత్య చేసినట్లు తెలిసింది.

అక్రమ సంబంధానికి అడు వస్తున్నాడన్న కారణంతో కవిత అతడికి విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టిందని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి కవిత తన చెల్లెలి భర్త సహాయాన్ని కూడా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు

చిన్నప్పట్నుంచి చెడు స్నేహాలు, చెడు అలవాట్ల కారణంగా విపరీత ధోరణులు ఏర్పడి హత్యలకు దారితీస్తాయని సైకియాట్రిస్ట్ లు చెబుతున్నారు. భార్యాభర్తల్లో విపరీత ధోరణులు పెరగగానే సకాలంలో కౌన్సిలింగ్ చేయించాలని వాళ్లు కోరుతున్నారు.


Read More
Next Story