తొందరలోనే పబ్లిక్ డొమైన్లోకి కమిషన్ రిపోర్టు
x
Revanth

తొందరలోనే పబ్లిక్ డొమైన్లోకి కమిషన్ రిపోర్టు

హైకోర్టును కన్వీన్స్ చేయటానికి అవసరమైన వాదనలను ప్రభుత్వ లాయర్లు విచారణ సందర్భంగా సమర్ధవంతంగా వినిపించలేకపోయారు


బీసీలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 42శాతం జీవో ఎంఎస్ 9పై హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఎందుకు ఇచ్చిందంటే విచారణ సందర్భంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు(BC Reservations) ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టును రేవంత్(Revanth) ప్రభుత్వం కన్వీన్స్ చేయలేకపోయింది. హైకోర్టును కన్వీన్స్ చేయటానికి అవసరమైన వాదనలను ప్రభుత్వ లాయర్లు విచారణ సందర్భంగా సమర్ధవంతంగా వినిపించలేకపోయారు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే (డెడికేటెడ్ కమిషన్)బూసాని వెంకటేశ్వర్లు కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టును ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు.

ప్రభుత్వం చేయాల్సింది ఏమిటంటే కమిషన్ రిపోర్టు అందగానే దానిపై అధ్యయనంచేసి సదరు రిపోర్టును ప్రజల కోసం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. రిపోర్టుపై ప్రజల సలహాలను, సూచనలను తీసుకోవాలి. అభ్యంతరాలు చెప్పటానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలి. ఇవేవీ రేవంత్ ప్రభుత్వంచేయలేదు. ఈవిషయంలోనే రేవంత్ ప్రభుత్వం పెద్ద తప్పుచేసిందని తేలిపోయింది. ఇదేవిషయాన్ని హైకోర్టులో విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. ధర్మాసనం ప్రశ్నకు అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోయారు. అనేక కారణాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవటాన్ని తప్పుపడుతు జీవో 9 అమలుపై స్టే విధించింది.

ఇపుడిదే విషయమై మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతు తొందరలోనే కమిషన్ రిపోర్టును ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టబోతున్నట్లు చెప్పింది. కమిషన్ రిపోర్టు, ఎంపిరికల్ డేటా వివరాలను బయటపెట్టకపోవటానికి కొన్ని ఆంక్షలున్నాయని చెప్పారు. రిజర్వేషన్ల అమలులో ఎవరూ అడ్డంకులు సృష్టించకూడదన్న ఉద్దేశ్యంతోనే కమిషన్ రిపోర్టును ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని చెప్పారు. అయితే కోర్టు విచారణ సందర్భంగా వెల్లడైన కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ రిపోర్టును తొందరలోనే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ చేసిందని చెప్పారు.

Read More
Next Story