కమ్యూనిస్ట్ లదే ఉజ్వల భవిష్యత్తు
x
CPI 100 years celebrations

కమ్యూనిస్ట్ లదే ఉజ్వల భవిష్యత్తు

వందేళ్ల సిపిఐ ఉత్సవాలను పురస్కరించుకుని బస్సుయాత్ర ప్రారంభించిన కూనంనేని


కమ్యూనిస్ట్ లు ఉంటేనే సమాజ పరిరక్షణ సాధ్యమవుతుందని సిపిఐ కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ వందేళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉమ్మడిఆదిలాబాద్ జిల్లా జోడే ఘాట్ నుంచి సిపిఐ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను కూనంనేని లాంఛనంగా ప్రారంభించారు. రానున్న రోజుల్లో కమ్యూనిస్ట్ లదే ఉజ్వల భవిష్యత్ అని అన్నారు. చట్ట సభల్లో కమ్యూనిస్ట్ లు ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎర్ర జెండాల పోరాటాల వల్లే పేద ప్రజలకు భూములు దక్కాయన్నారు.

సిపిఐ వందేళ్ల జాతీయ స్థాయి ముగింపు సభ వచ్చే నెల 26 వ తేదీన ఖమ్మం పట్టణంలో జరుగనుందని తెలిపారు. ఈసారి ముగింపు సభకు వివిధ రాష్ట్రాల నుంచి సిపిఐ నేతలు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. లక్షలాది మంది ప్రజలు తరలి రానున్న ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ నేత చాడా వెంకట రెడ్డి నాయకత్వం వహిస్తారని కూనంనేని తెలిపారు. దేశంలో మతోన్మాదాన్ని పారద్రోలడానికి కమ్యూనిస్ట్ లు ఏకం కావాలన్నారు.

శత జయంతి ఉత్సవాలు జయప్రదం చేయండి

సీపీఐ వందేళ్ల ఉత్సవాలను జయప్రదం చేయాలని మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి డిసెంబరు 25 నాటికి వందేళ్లు పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో సీపీఐ ఉత్సవాలను డిసెంబరు 15 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నామన్నారు. కుమరం భీం జిల్లా జోడేఘాట్‌ నుంచి భద్రాచలం వరకు నిర్వహించే రాష్ట్ర జాతాను విజయవంతం చేయాలని కోరారు. స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తున్న పార్టీ సీపీఐ అన్నారు.

Read More
Next Story