కాలేజీల యాజమాన్యాలకు షాకిచ్చిన ప్రభుత్వం
x
Telangana government

కాలేజీల యాజమాన్యాలకు షాకిచ్చిన ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్ మెంట్ విధానంపై అద్యయనం చేయటానికి నిపుణుల కమిటిని నియమించింది


ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. తాజా పరిణామం ప్రకారం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇప్పట్లో లేనట్లేనా ? ప్రభుత్వం తాజా నిర్ణయం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఫీజు రీయింబర్స్ మెంట్ విధానంపై అద్యయనం చేయటానికి నిపుణుల కమిటిని నియమించింది. సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్ గా , ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరామ్, ఆర్ధిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నుండి ముగ్గురిని కమిటీలో సభ్యులుగా నియమించింది.

ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు రు. 10 వేల కోట్లు పేరుకుపోయాయని, ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పాలని యాజమాన్యాల సమాఖ్య ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాకపోవటంతో సోమవారం నుండి నిరవధిక సమ్మె మొదలుపెట్టింది. యాజమాన్యాలు సమ్మె మొదలుపెట్టాయి కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి ఎంతో కొంత రీఎంబర్స్ మెంట్ చేస్తుందని అందరు అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే సడెన్ గా ఫీజు రీయింబర్స్ మెంట్ విధానంపై నిపుణుల కమిటీని నియమించటంతో సమాఖ్యకు షాక్ తగిలినట్లయ్యింది.

కమిటీ ఏర్పాటు అంటే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ఇప్పట్లో తీర్చే ఉద్దేశ్యంలో ప్రభుత్వానికి లేదన్న విషయమం అర్ధమవుతోంది. ఎందుకంటే ఫీజు రీయింబర్స్ మెంట్ విధానంపై అధ్యయనంచేసి మూడునెలల్లో రిపోర్టు ఇవ్వాలని ఉత్తర్వుల్లోనే ప్రభుత్వం కమిటీకి స్పష్టంచేసింది. అంటే కమిటి రిపోర్టు ఇచ్చేంతవరకు, రిపోర్టు ఇచ్చిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత కాని రీయింబర్స్ బకాయిలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదనే అనుకోవాలి. మరప్పటివరకు సమాఖ్య ఆధ్వర్యంలో మొదలైన నిరవధిక సమ్మె పరిస్ధితి ఏమిటి ? ఏమిటంటే సమ్మె మొదలుపెట్టిన సమాఖ్యనే సమాధానం చెప్పాలి.

Read More
Next Story