ది గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ కల్చర్ నవల ఆవిష్కరణ
x

'ది గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ కల్చర్' నవల ఆవిష్కరణ

జన్మదినంగా పాణిగ్రాహి బేతి పుస్తకావిష్కరణ


-సులేఖ


బాల సాహితీ వేత్త పాణిగ్రాహి బేతి కలం నుండి వెలువడిన “ ది గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ కల్చర్ “ అనే పుస్తకం యొక్క జన్మదిన కార్యక్రమం జరిగింది. నాలుగు వేలఏళ్లనాటి సింధు నాగరికత , హరప్పా ప్రజలు వారి సంస్కృతి, ఆర్యుల ప్రవేశం వారి జీవన విధానం రెంటి మధ్య సంఘర్షణ కాలక్రమంలో సాగిన సమ్మేళనం ఒక చరిత్ర.


ఇటీవల జెనెటిక్సు, డిఎన్ ఏ పరిశోధనలు అనేక నూతన విషయాలను వెలికి తీసాయి. ఇంతదాకా ఉన్న చరిత్రను, చారిత్రక అవగాహనను మలుపు తిప్పాయి. ఈ పరిశోధనల వెలుగులో రాయబడిన ప్రాచీన చరిత్ర కథనమే “ ది గ్రేటెస్ట్ బ్యాటిల్ కల్చర్" నవల.




నూతన పరిశోధనల వెలుగులో హరప్పా సింధునాగరిక ప్రజలపై ప్రపంచంలో వెలువడిన తొలి నవల ఇది. అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ముద్దుబిడ్డ ఈ నవల రాయడం విశేషం. హైదరాబాద్ గచ్చి బౌలి,” మైండ్ స్పేస్ సమీపంలోని రాంకీ టవర్సులో ఈ కార్యక్రమం జరిగింది. పాణిగ్రాహి 50 వ జన్మదినం సందర్భాన్ని పెద్ద ఎత్తున జరపాలనుకున్న కుటుంబం ఉత్సాహాన్ని అంగీకరించక పోవడంలో కుటుంబ సభ్యులు ఈ సందర్భాన్ని పాణిగ్రాహి రాసిన పుస్తకానికి జన్మదినంగా నిర్వహించారు.


బర్త్ డే కేక్ పుస్తకం ముఖ చిత్రంతో తయారు చేయించడం ఒక నూతన ఆలోచన. బి ఎస్ రాములు పెద్ద కొడుకైన పాణిగ్రాహి 1998 లో అమెరికా వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్నారు. బాల్యం నుండే పత్రికలకు అనేక రచనలు పంపి బహుమతులు గెలుచుకున్న పాణిగ్రాహి పుస్తక ప్రియుడు, చిన్నపుడు కె వి నరేందర్, కథలను, సి నర్సింహారావు, యండమూరి వీరేంద్రనాథ్ ల వ్యక్తిత్వ వికాస గ్రంథాలను అభిమానించేవాడు.


అమెరికాలో పుస్తక పఠనం మరింత విస్తరించింది. ఆ క్రమంలో రాయబడినదే “ ది గ్రేటెస్ట్ బ్యాట్స్ ఆఫ్ కల్చర్” నవల. ఇటీవల అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ లలో వేగంగా అమ్ముడవుతున్న నవల గా ప్రశంసలు పొందుతున్నది. నవల వెలువడిన వెంటనే చక్కని లోతైన సమీక్షలు వెలువడడం ఈ నవల విశిష్టత.






రోజలిండ్ గారి @హారీ పోటర్ " నవల కన్నా భిన్నంగా అంతే ఆసక్తి కరంగా, ప్రతి పేజీ ఉత్కంఠతో ఈ నవల చదివింపజేస్తుంది. ఈ నవల చదవుతుంటే ఆయా దృశ్యాలు సన్నివేశాలు బాహుబలి సినిమా వలె పాఠకుల మనో ఫలకం పై కదలాడుతాయి. పాఠకుల ఊహాశక్తిని కల్పనా శక్తిని పెంచుతాయి. ఇలా అనుకోకుండా ఒక పుస్తకం తన జన్మదినం జరుపుకోవడం, అది హరప్పా వారసులైన


బంధుమిత్రల మధ్య కుటుంబ పండుగగా జరగడం ఒక విశేషం.

Read More
Next Story