అఖండ ప్రీమియర్ షోలకు హైకోర్టు షాక్
x
High court shocks to Akhanda Movie makers

అఖండ ప్రీమియర్ షోలకు హైకోర్టు షాక్

ఏ ముహూర్తంలో(Akhanda Movie) అఖండ-2 సినిమా రిలీజ్ డేట్ ను నిర్మాతలు ప్రకటించారో తెలీదుకాని ఏదో ఒకసమస్య ఎదురవుతునే ఉంది.


నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ తాండవం సినిమాకు కష్టాలు తప్పటంలేదు. ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు(Revanth) ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. టికెట్ల రేట్లను పెంచుకునేందుకు లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఏ ముహూర్తంలో(Akhanda Movie) అఖండ-2 సినిమా రిలీజ్ డేట్ ను నిర్మాతలు ప్రకటించారో తెలీదుకాని ఏదో ఒకసమస్య ఎదురవుతునే ఉంది. మొదటసారి దెబ్బకు సినిమా రిలీజ్ డేటే మారిపోయింది. 5వ తేదీన రిలీజవ్వాల్సిన సినిమా 11 రాత్రి ప్రీమియర్ షోతో రిలీజవుతోంది. ఇపుడు రెండో దెబ్బకు టికెట్ల రేట్లను తగ్గించుకోవాల్సొచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షో టికెట్లను నిర్మాణ సంస్ధ అమ్ముకునేసింది. టికెట్ల రేట్ల ధరల పెంపు జీవోను కొట్టేసిన హైకోర్టు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, సినీ నిర్మాణ సంస్ధకు కూడా నోటీసులు జారీచేసింది.

అఖండ సినిమాకు స్పెషల్ షోతో పాటు టికెట్ల ధరలు పెంచుకునేందుకు రేవంత్ ప్రభుత్వం అనుమతించిన విషయం అందరికీ తెలిసిందే. శుక్రవారం అంటే ఈనెల 12వ తేదీనుండి 14వ తేదీవరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్ల ధరలు టికెట్ పై 50 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో రు. 100 అదనంగా వసూలు చేసుకోవచ్చని జీవోలో ఉంది. గురువారం ప్రీమియర్ షో టికెట్ ధర రు. 600కు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.

టికెట్ ధరల రేట్లను పెంచుకునేందుకు అంగీకరించిన ప్రభుత్వం వచ్చే లాభాల్లో 20శాతాన్ని సినీకార్మికుల సంక్షేమానికి ఉపయోగించాల్సిందిగా నిర్మాణ సంస్ధను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ ఆదేశంపై నిర్మాణ సంస్ధ ఏమిచేస్తుందో చూడాలి. ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దుచేయాలని ఒక లాయర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం కారణంగా విచారణ జరిగింది.

Read More
Next Story