
బీహార్ యాత్రలో రేవంతే హైలైట్..ఓపెన్ టాప్ జీపే నిదర్శనం
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దర్భంగా యాత్రకాదు.
ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh), మంత్రులు చాలామంది బీహార్ వెళ్ళారు. హైదరాబాదు నుండి ఢిల్లీకి వెళ్ళిన రేవంత్(Revanth) బృందం అక్కడి నుండి బీహార్(Bihar) కు వెళ్ళింది. దర్భంగలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధి(Rahul Gandhi), ప్రియాంకగాంధి)Priyanka Gandhi), ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్(Tejaswi Yadav) తదితరులతో పాటు ఇండియా(INDIA) కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దర్భంగా యాత్రకాదు. రేవంత్ హైలైట్ అయిన విధానమే. ఢిల్లీ నుండి రాహుల్, ప్రియాంకలు ప్రత్యేక విమానంలో తమతో పాటు రేవంత్ తదితరులను కూడా తీసుకెళ్ళారు.
విమానంలో ప్రయాణించేటప్పుడే తెలంగాణ వ్యవహారాలగురించి ఇద్దరు అగ్రనేతలు రేవంత్ తో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుండి భారీ ర్యాలీలో ఓపెన్ టాప్ జీపులో ప్రయాణించారు. జీపులో ఒకవైపు ప్రియాంకగాంధి, మరోవైపు రాహుల్ ఉన్నారు. వీళ్ళిద్దరికీ మద్యలో రేవంత్ ఉండటమే విశేషం. బీహార్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న తేజస్వి వీళ్ళకు వెనుకవైపు నిలబడ్డారు. మామూలుగా ఓపెన్ టాప్ జీపులో ర్యాలీలో వెళ్ళేటపుడు అటు ఇటు ఎవరు నిలబడినా మధ్యలో మాత్రం అగ్రనేతే నిలబడతారు. కాని దర్భంగా యాత్రలో మాత్రం రేవంత్ మధ్యలో నిలబడితే రెండువైపులా ప్రియాంక, రాహుల్ నిలబడటమే ఆశ్చర్యంగా ఉంది.
తాజా పరిణామంతో కాంగ్రెస్ అగ్రనేతలు రేవంత్ కు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అందరికీ అర్ధమవుతోంది. రేవంత్ ను రాహుల్ దగ్గరకు చేర్చటంలేదని, సీఎం పనైపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ పై మైండ్ గేమ్ ఆడటానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలుస్తోంది. అయితే కేటీఆర్ విమర్శలు చేసేకొద్దీ కాంగ్రెస్ అగ్రనేతల దగ్గర రేవంత్ కున్న పట్టు కూడా అంతే స్ధాయిలో తెలుస్తోంది. దర్భంగలో యాత్ర అయిపోయిన తర్వాత అక్కడి నుండి ప్రత్యేక విమానంలో రేవంత్ బృందం మంగళవారం రాత్రి హైదరాబాదుకు చేరుకుంది.