హిడ్మాపై ‘మైండ్ గేమ్’ మొదలైంది(వీడియో)
x
Hidma mother Punji and Chhattisgarh Home Minister Vijay Sarma

హిడ్మాపై ‘మైండ్ గేమ్’ మొదలైంది(వీడియో)

హిడ్మా, దేవా తల్లులతో కలిసి హోంమంత్రి భోజనంచేయటం ఇక్కడ హైలైట్ అనిచెప్పాలి


మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మాడ్వీ హిడ్మాపై ఛత్తీస్ ఘడ్ పోలీసులు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా హిడ్మా తల్లి పుంజి మాడ్వితో రాష్ట్ర డిప్యుటి సీఎం, హోంశాఖ మంత్రి విజయ్ శర్మ(Home Minister Vijay Sarma) బుధవారం భేటీ అయ్యారు. పుంజితో భోజనం కూడా చేశారు. (Maoist leader Hidma)హిడ్మాను లొంగిపోయేట్లు చెప్పాల్సిందిగా ఆమెను కన్వీన్స్ చేశారు. తర్వాత హిడ్మాను లొంగిపొమ్మంటు తల్లితో పోలీసులు ఒక వీడియో తయారుచేసి మీడియాకు విడుదలచేశారు. పనిలోపనిగా వరసకు హిడ్మా సోదరుడు అయ్యే బర్సాదేవా తల్లితో కూడా హోంమంత్రి మాట్లాడారు. ఆమె కూడా కొడుకును మావోయిస్టు(Maoist Party) పార్టీని వదిలేసి జనజీవనశ్రవంతిలో కలిసిపోవాల్సిందిగా కొడుకును కోరిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు.

కొంతకాలంగా హిడ్మా టార్గెట్ గా ఆపరేషన్ కగార్ ఉధృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇపుడు భద్రతాదళాలకు పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ(పీజీఎల్ఏ)కార్యదర్శి హిడ్మానే మోస్ట్ వాంటెడ్. భద్రతాదళాలు, పోలీసుల సమాచారం ప్రకారం ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి హిడ్మానే ఆయువుపట్టు. హిడ్మా ఎన్ కౌంటర్లో చనిపోయినా లేదా ప్రభుత్వానికి లొంగిపోయినా మావోయిస్టుపార్టీకి కోలుకోలేని దెబ్బపడటం ఖాయం. మావోయిస్టుపార్టీకి హిడ్మాను ఆయువుపట్టని ప్రచారంలో ఉంది. అందుకనే భద్రతాదళాలు అనేక రకాలుగా హిడ్మా కోసం నెలలతరబడి ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇప్పటికి మూడుసార్లు దండకారణ్యంలోని కర్రెగుట్టల్లో జరిగిన ఎన్ కౌంటర్లనుండి హిడ్మా తృటిలో తప్పించుకున్నాడు. ఎన్ కౌంటర్ల నుండి తప్పించుకోవటంతో ఎలాగైనా హిడ్మాను ఏదోరూపంలో పట్టుకోవాలన్న కసి భద్రతాదళాల్లో పెరిగిపోతోంది. మావోయిస్టు కేంద్రకమిటి కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు కీలకనేతలు రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుధాకర్ తదితరులు ఎన్ కౌంటర్లలో చనిపోయారు. ఈ నేపధ్యంలోనే మావోయిస్టు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, సుజాత లాంటి కొందరు పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఏమైందంటే అజ్ఞాతంలో ఉన్న మరికొందరు కీలకనేతలపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. మావోయిస్టు నేతల ముందు ఇపుడున్న ఆప్షన్ ఒకటే. అదేమిటంటే ఎన్ కౌంటర్లలో చనిపోవటమా ? లేకపోతే ప్రభుత్వానికి లొంగిపోవటమా ?

ఈ ఒత్తిడిలోనే హిడ్మా కూడా తన మద్దతుదారులతో ప్రభుత్వానికి లొంగిపోయేందుకు ఆలోచిస్తున్నాడు అనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. దీన్ని పోలీసులు అడ్వాంటేజ్ గా తీసుకోవాలని అనుకున్నారు. అందుకనే హిడ్మా సొంతూరు అయిన బస్తర్ జిల్లాలోని పూర్వర్తికి హోంశాఖ మంత్రి వెళ్ళారు. మామూలుగా ఎలాగుంటుందంటే బస్తర్ జిల్లాలోని అడవులు మావోయిస్టులకు కంచుకోటలాంటిది. జిల్లాలో విస్తరించున్న అడవుల్లోకి ఒకపుడు పోలీసులు అడుగుకూడా పెట్టేవారు కాదు. హిడ్మా గ్రామం పూర్వర్తిలోకి అడుగుపెట్టడాన్ని పోలీసులు కలలో కూడా సాహించలేరు. అలాంటి గ్రామంలోకి ఇపుడు ఏకంగా హోంశాఖ మంత్రే వెళ్ళారంటే పరిస్ధితుల్లో బాగా మార్పువచ్చిందని అర్ధంచేసుకోవాలి.


మంత్రి పుంజితో మాట్లాడి హిడ్మాను లొగిపోయేట్లుగా అప్పీల్ చేసేందుకు హోంమంత్రి ఒప్పించారు. హిడ్మా, దేవా తల్లులతో కలిసి హోంమంత్రి భోజనంచేయటం ఇక్కడ హైలైట్ అనిచెప్పాలి. ఈ సందర్భంగా ఇద్దరు తల్లులు తమ కొడుకులు హిడ్మా, దేవాలను ప్రభుత్వానికి లొంగిపోవాలని విజ్ఞప్తులు చేశారు. ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ 2026, మార్చి 31 దగ్గరకు వచ్చేస్తోంది.

ఈలోగానే లొంగిపోవటమో లేకపోతే ఎన్ కౌంటర్లో చనిపోవటమే ఏదో ఒకటి తేల్చుకోవాలన్నట్లుగా కేంద్రప్రభుత్వం అన్నీ కోణాల్లో మావోయిస్టుపార్టీపై బాగా ఒత్తిడి పెంచేస్తోంది. హోంమంత్రి పూర్వర్తికి వెళ్ళటం, హిడ్మా, దేవా తల్లులతో భోజనంచేయటం, వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వానికి లొంగిపోవాలని కొడుకులకు వాళ్ళతోనే చెప్పించటం ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.

Read More
Next Story