ఆ జూనియర్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి
x
వినతిపత్రం అందించిన విద్యార్థి నాయకులు

ఆ జూనియర్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి

తెలంగాణలో కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఇష్టానురీతీగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ జూనియర్ కళాశాలైన శ్రీ చైతన్య ,నారాయణ సహ ఇతర కార్పొరేట్ కళాశాలలు పదో తరగతి విద్యార్థులకు ముందస్తుగా స్కాలర్షిప్ టెస్టులు నీట్, మెయిన్స్, అంటూ పలురకాల టెస్టులు నిర్వహిస్తున్నాయని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఆరోపించింది. ఈ టెస్టుల ఆధారంగా ప్రవేశాలు చేస్తున్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని గురువారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు.

అనంతరం ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడారు. ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ప్రవేశాలకు తేదీలు ప్రకటించక ముందే కొన్ని కార్పొరేట్ కళాశాల యజమాన్యాలు బ్రోకర్లను నియమించుకొని టెస్టులు నిర్వహిస్తూ ప్రవేశాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై స్థానికంగా ఉన్న జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో కార్పొరేట్ విద్యాసంస్థలు కళాశాలల యజమాన్యాలు రెచ్చిపోతున్నారని, అహంకారపూరితంగా వ్యవహరిస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేశారని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే ఇంటర్మీడియట్ కళాశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే ఇంటర్ విద్యార్థుల ఫీజులపై ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు అధికారులు స్పందించి ముందస్తు అడ్మిషన్ చేస్తున్న కళాశాలలు, టెస్టు నిర్వహిస్తున్న కళాశాలల పై కేసులు నమోదు చేసి గుర్తింపు రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు .వినతి పత్రం సమర్పించిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సంద గణేష్ రాష్ట్ర నాయకులు హరీష్ నాయకులు వంశీ రాహుల్ తదితరులు ఉన్నారు

Read More
Next Story