భూముల వేలానికి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ రెడీ..
x

భూముల వేలానికి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ రెడీ..

అక్టోబర్ 6 నుంచి స్టార్ట్ కానున్న వేలం ప్రక్రియ.


రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములను వేలం వేయడానికి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ రెడీ అయింది. ఈ వేలానికి సంబంధించి సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కాగా దాదాపు 100 ప్లాట్లను వేలం వేయనుంది. ఈ వేలం ప్రక్రియ అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 20 వరకు కొనసాగనుంది. ఈ ప్లాట్ల వేలం.. మేడ్చల్, కేపీహెచ్‌బీ, నాంపల్లి, నిజామాబాద్, గద్వాల, రావిర్యాల, సదాశివపేట వంటి ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ వేలం వేసే ప్లాట్లలో రెసిడెన్షియల్, కమర్షియల్, ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. వేలం వేయనున్న ప్రతి ప్లాట్‌కు ప్రత్యేకంగా రిజర్వ్‌డ్ ధర నిర్ణయించబడింది. తగిన రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత ఎంఎస్‌టీసీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా వేలం జరగనుంది.

హౌసింగ్ బోర్డ్ వేసిన అంచనా ప్రకారం.. ఈ భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఆదాయం రావొచ్చు. ఈ విధంగా రాష్ట్రానికి అదనపు రాబడి వచ్చినట్లే, పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కూడా వేగవంతం అవుతాయి. హౌసింగ్ బోర్డ్ ప్లాట్ల వేలం ద్వారా జనరేటెడ్ రెవెన్యూని వివిధ సివిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ వేలం ద్వారా కొత్త హౌసింగ్, రోడ్డులు, పార్క్‌లు, కమ్యూనిటీ సెంటర్ల వంటి అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయిన అధికారులు అంటున్నారు.

Read More
Next Story