
Oruganti srinivas, IAS, Rajasthan Chief secretary
రాజస్థాన్ సీఎస్ ఓరుగంటి, మన పీవీ చుట్టమే!
ఆంధ్రాలో పుట్టి తెలంగాణలో పెరిగిన ఓ ఐఎఎస్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)అయ్యారు.
ఆంధ్రాలో పుట్టి తెలంగాణలో పెరిగిన ఓ ఐఎఎస్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)అయ్యారు. విద్యావంతుడు, క్రీడాకారుడైన తెలుగు వ్యక్తి ఓరుగంటి శ్రీనివాస్ రాజస్థాన్ లో అత్యున్నత పోస్టుకు ఎదగడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం కేంద్ర సర్వీసుల్లో రాణించిన ఆయన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సమయంలో సీఎస్ గా నియమితులు కావడం గమనార్హం. ఆయన నవంబర్ 17న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎవరీ ఓరుగంటి శ్రీనివాస్?
1989 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి ఓరుగంటి శ్రీనివాస్. 1966 సెప్టెంబరు 1న విశాఖపట్నానికి సమీపంలోని అరకు లో జన్మించారు. తండ్రి జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ పని చేశారు. ఆ సమయంలోనే శ్రీనివాస్ జన్మించారు. అరకులోయలోనే ఆయన బాల్యం గడిచింది. ఆ తర్వాత ఆయన కుటుంబం దుమ్ముగూడెంలో పెరిగారు. భద్రాచలం పంచాయితీ స్కూల్లో చదివారు.
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1987లో కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, 1989లో ఎంటెక్ పూర్తిచేశారు. తర్వాత ఐఏఎస్‌కి ఎంపికై రాజస్థాన్ క్యాడర్ లో చేరారు. మంచి క్రీడాకారుడు. జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడారు.
ఈయనకు మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబానికి కూడా సంబంధాలు ఉన్నాయి. ఆయన మునిమనుమరాలిని వివాహం చేసుకున్నారు.
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన సంస్కరణలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్లు, పింఛనుదారుల సంక్షేమం విభాగం కార్యదర్శిగా పని చేశారు. ఐఎఎస్ అధికారుల సంఘం బాధ్యతలు కూడా నిర్వహించారు. మంచి రచయిత. ‘టువర్డ్స్ ఏ న్యూ ఇండియా’ అనే పుస్తకాన్ని ఆయన ఇటీవల రాశారు. అరకు లోయలో తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఢిల్లీ నుంచి స్వరాష్ట్ర క్యాడర్‌కు తిప్పి పంపిన మరుసటి రోజే సీఎస్‌గా నియమిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
చంద్రబాబుతోనూ సంబంధాలు...
ఓరుగంటి శ్రీనివాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖపట్నంలో సెప్టెంబరు 22-23 తేదీల్లో జరిగిన 28వ నేషనల్ ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్‌లో ఓరుగంటి శ్రీనివాస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ‘‘90వ దశకం నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కి మీరు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ, సంస్థల పనితీరును మార్చి కోట్లమందికి ప్రయోజనం చేకూరింది. నేను అండర్ సెక్రటరీగా చేరినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నేను 37 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకోబోతున్న తరుణంలోనూ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మీరు దేశానికి చేసిన సేవలకు మేం చేస్తున్న సెల్యూట్‌ను స్వీకరించండి’’ అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సంక్షిప్త జీవిత చరిత్ర
పేరు: ఓరుగంటి వీ. శ్రీనివాస్, IAS (1989 బ్యాచ్ – రాజస్థాన్ క్యాడర్)
జననం: 1 సెప్టెంబరు 1966
విద్య: B.Tech, M.Tech (కెమికల్ ఇంజినీరింగ్), ఉస్మానియా విశ్వవిద్యాలయం
ప్రారంభ జీవితం
1966లో జన్మించిన శ్రీనివాస్ చిన్ననాటి రోజులు అరకులోయ పరిసరాల్లో గడిచాయి. ఆయన తండ్రి జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్‌గా పనిచేసిన వేళ కుటుంబం అక్కడే ఉండేది.
అనంతరం భద్రాచలం పంచాయతీ స్కూల్‌లో చదువు కొనసాగించారు. 1987లో B.Tech, 1989లో M.Tech పూర్తిచేసి IAS ఎంపిక అయ్యారు.
IAS ప్రయాణం — 36 ఏళ్లు
22 ఏళ్ల వయసులో IASలో చేరిన శ్రీనివాస్ ఇప్పటివరకు భారత ప్రభుత్వంలో 20 సంవత్సరాలు, రాజస్థాన్ ప్రభుత్వంలో 14 సంవత్సరాలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో 3 సంవత్సరాల సేవలందించారు.
కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు
2021–2025: సెక్రటరీ, Department of Administrative Reforms & Public Grievances; Pension & Pensioners Welfare; DoPT; Ministry for Development of North Eastern Region
Director General, National Centre for Good Governance
2018–2021: Special/Additional Secretary, DARPG
2010–2017: Joint Secretary — Textiles, Culture, Health
2000–2003: ప్రైవేట్ సెక్రటరీ — భారత ఆర్థిక మంత్రికి, విదేశాంగ మంత్రికి
రాజస్థాన్‌లో సేవలు
చైర్మన్ — Board of Revenue (2017–18)
Secretary — Finance, Planning, Health, Science & Technology (2007–10)
కలెక్టర్ — జోధ్‌పూర్, పాలి
Director — Watershed Development, Soil Conservation
ఇతర కీలక జిల్లా–రాష్ట్ర బాధ్యతలు
అంతర్జాతీయ హోదాలు
2025–2028: President, International Institute of Administrative Sciences (IIAS), Brussels — ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయుడు
IMF, Washington DC – Advisor to Executive Director (India)
భారత ప్రతినిధి — UNGA 2001, IMF–World Bank Meetings (2002–06), SAARC, Commonwealth
International Cotton Advisory Committee, SAARC Culture Centre, IIAS వంటి అనేక వేదికల్లో సభ్యుడు
2018–24 మధ్య ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్, పోర్చుగల్, శ్రీలంక, మాల్దీవులు తదితర దేశాలతో పబ్లిక్ పాలిసీ JWGలకు నాయకత్వం
ప్రభుత్వ సంస్కరణల్లో ప్రధాన పాత్ర
CPGRAMS, e-Office, Bhavishya వంటి ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫార్ముల రూపకర్త
56 కామన్వెల్త్ దేశాలకు ఆదర్శంగా నిలిచిన grievance-redressal మోడల్
Civil Services Day, PM’s Awards (2018–2025)ను విజయవంతంగా నిర్వహణ
Swachhata Campaigns, Good Governance Week, Pendency Reduction కార్యక్రమాల్లో కీలక నాయకత్వం
AIIMS, New Delhiని భారత తొలి ఫుల్-డిజిటల్ ప్రభుత్వ ఆసుపత్రిగా అభివృద్ధి
క్రీడల్లోనూ ప్రావీణ్యం..
జాతీయస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
Narang Cup విజేత (1984)
All India Universities Champion (1989)
ఉస్మానియా, ఆంధ్రప్రదేశ్ జట్లకు కెప్టెన్/ప్రతినిధి
అవార్డులు
Rajbhasha Kirti Puraskar (2024)
Digital India Award (2020)
AIIMS Leadership Awards (2016, 2017)
National Productivity Council Awards (1995, 1997)
Chief Minister’s Certificate for Outstanding Public Service (1998, 2019)
పుస్తకాలు, పరిశోధన
India’s Relations with IMF 1991–2016
G20@2023 – Roadmap to Indian Presidency
The March to New India – Governance Transformed (2014–2019)
250కు పైగా పరిశోధనా పత్రాలు, 175కు పైగా ముఖ్య ఉపన్యాసాలు
IIAS–DARPG Viksit Bharat@2047 – Governance Transformed పుస్తకానికి ఎడిటోరియల్ చైర్మన్
Next Story

