మెదక్ జిల్లాలో మానవత్వం మంట కలిసింది
x

మెదక్ జిల్లాలో మానవత్వం మంట కలిసింది

దొంగపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన వైనం


మానవత్వం మంట గలిసే ఘటన ఇది. మెదక్ జిల్లాలో శుక్రవారం బైక్ లు దొంగతనం చేసే వ్యక్తిపై అమానుషంగా ప్రవర్తించారు. కొందరు గ్రామస్థులు.దొంగను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు విచక్షణ కోల్పోయి పెట్రోల్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలకు గురైన దొంగ కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్నాడు. బ్రతికే అవకాశమే లేదని వైద్యులు తేల్చారు.

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈ దారుణం జరిగింది.

చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన మహిపాల్, యవాన్ లు జులాయిగా తిరిగేవారు. బైక్ లు దొంగతనం చేసి విక్రయించేవారు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారు. వడియారం గ్రామంలోబైక్ దొంగతనం చేసిన వ్యక్తులు పెట్రోల్ బాటిల్ కూడా దొంగిలించారు. దొంగతనం చేసిన బైక్ లో పెట్రోల్ లేకపోవడంతో కొంతదూరం వెళ్లాక ఆగిపోయింది. తమతో తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ నిర్మానుష్య ప్రదేశంలో నింపాలని డిసైడ్ అయిన యువకులు కొద్ది దూరం త్రోసుకుంటూ వెళుతుండగా స్థానికులు వీరిని గుర్తించారు. దుర్గామాత నిమజ్జనోత్సనంలో పాల్గొన్న గ్రామస్థులు దొంగలను గుర్తించి దాడి చేయబోయారు. మహిపాల్ పారిపోగా యవాన్ చిక్కాడు. యవాన్ ను చెట్టుకు కొట్టేసి కొట్టారు. యవాన్ చేతిలో ఉన్న పెట్రోల్ తీసుకుని శరీరమంతా చల్లి నిప్పంటించారు. తీవ్రగాయాలపాలైన యవాన్ ను పోలీసులు గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం యవాన్ ఆరోగ్యం విషమంగా ఉంది.

Read More
Next Story