రుణ మాఫీ నేపథ్యంలో సైబర్ దొంగలున్నారు..జర జాగ్రత్త
తెలంగాణలో సైబర్ నేరాల కేసులు పెరిగాయి.దీంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ పోలీసులు హెచ్చరించారు.రుణమాఫీ చేయడంతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ చేసిన నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఎదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు, పిక్చర్ బ్యాంకు లోగో తో వాట్స్ యాప్ లో ఏఫీకే ఫైల్స్ పంపిస్తున్నారని బుధవారం సైబర్ పోలీసులు గుర్తించారు.
- ఈ సైబర్ నేరగాళ్ల ఫైల్స్ ఆమోదిస్తే మన వాట్స్ యాప్ వాళ్ళ కంట్రోల్ కీ వెళ్లి పోతుందని ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు గురువారం హెచ్చరికలు జారీ చేశారు.
- రైతుల వాట్సాప్ నంబర్లే కాకుండా వారి కాంటాక్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సైబర్ నేరగాళ్ల మెసేజ్ వెళుతుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ నూకల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.
- ఈ లింక్ ద్వారా సైబర్ నేరస్థులు గూగుల్ పే, ఫోన్ పే,యూపీఐ నెట్ వర్క్ ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేస్తున్నారు.
- ట్రేండింగ్ లో ఉన్న టాపిక్ ద్వారా ఏపీకే ఫైల్స్ పంపి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు.
ఏపీకే ఫైల్స్ ఒపెన్ చేయొద్దు : సైబర్ సెక్యూరిటీ బ్యూరో
పీకే ఫైల్స్ ఒపెన్ చేయొద్దు అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది. ఏవైనా ఏపీకే ఫైల్స్ మీకు వాట్సాప్ లో లేదా మెయిల్ లో వస్తే మీరు ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యకూడదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ నూకల వేణుగోపాల్ రెడ్డి సూచించారు. మీ వాట్సాప్ పనిచేయకుంటే వెంటనే రీఇన్ స్టాల్ చేసి రిపోర్టు ఆప్షన్ లో రిపోర్ట్ చేయాలని ఆయన కోరారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే ఎలాంటి ఆలస్యం చెయ్యకుండా #1930 కీ కాల్ చెయ్యండి లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కోరారు.
పేట్రేగిపోతున్న సైబర్ స్కామర్లు
ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం ఒక ట్రిలియన్ డాలర్ల డబ్బును అమాయక ప్రజలు కోల్పోయారని గ్లోబల్ స్టేట్ స్కాం రిపోర్టు తేటతెల్లం చేసింది. 12 నెలల్లోనే సైబర్ న్కామర్లు ఒక ట్రిలియన్ డాలర్లను కొల్లగొట్టారంటే సైబర్ నేరాలు ఏమేర పెరిగాయో విదితమవుతోంది.
దేశంలో రూ.1750 కోట్లు స్వాహా
భారత దేశంలో ఈ ఏడాది మొదటి నాలుగు నెలల కాలంలో సైబర్ నేరగాళ్లు 1750 కోట్ల రూపాయలను కొల్లగొట్టారని తాజాగా వెల్లడైంది. సైబర్ నేరగాళ్లు రోజుకో రకం కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. దేశంలో 7.4 లక్షల సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదైనట్లు నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ లో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు కేవలం నాలుగు నెలల్లోనే సైబర్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
రోజుకు 7వేల సైబర్ నేరాల ఫిర్యాదులు
దేశంలో రోజుకు 7వేల సైబర్ నేరాల ఫిర్యాదులు రిజిస్టరు అవుతున్నాయని నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ తేటతెల్లం చేసింది. 2021 నుంచి 2023 మధ్య సైబర్ నేరాల పెరుగుదల అనూహ్యంగా పెరిగింది. 2022 నుంచి 2023 మధ్య 60.9 శాతం సైబర్ నేరాలు పెరిగాయి. నమోదైన సైబర్ నేరాల్లో 85 శాతం కేసులు ఆన్ లైన్ ఆర్థిక నేరాలేనని సైబర్ పోలీసులు చెప్పారు. తెలంగాణలోనూ ఇటీవల సైబర్ కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో తెలంగాణ సైబర్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
Next Story