Donald Trump
x
డోనాల్డ్ ట్రంప్

ట్రంప్ ఆరోగ్యంపై పుకార్లు, అమెరికాలో హడావుడి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అనే ప్రశ్నలతో అమెరికన్ సోషల్ మీడియా, టీవీ ఛానళ్లు హోరెత్తుతున్నాయి


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అనే ప్రశ్నలతో అమెరికన్ సోషల్ మీడియా, టీవీ ఛానళ్లు హోరెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా ఆయన పబ్లిక్‌లో కనబడకపోవడంతో, అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో తాను అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్ధం అంటూ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటించడం మరింత సంచలనానికి కారణమైంది. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై రకరకాల పుకార్లు బయల్దేరాయి.
సోషల్ మీడియాలో రూమర్లు..
ట్విట్టర్ (ప్రస్తుతం X) లో "Trump is dead" అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండటంతో అమెరికన్లు కంగారు పడిపోయారు. ఒక్కసారిగా ఎందుకు ఆయన ఎక్కడా కనిపించడం లేదన్నది పెద్ద చర్చగా మారింది. మరికొందరు ట్రంప్ అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారని, అందుకే బయటకు రాలేదని వాదిస్తున్నారు.
ఆరోగ్యం పై అనుమానాలు..
అమెరికా మీడియా రిపోర్టుల ప్రకారం, ఇటీవల ట్రంప్ ఆరోగ్యం బాగోలేదన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆయనకు రక్త ప్రసరణ సంబంధిత సమస్యలు ఉన్నాయంటూ రిపోర్టులు వచ్చాయి. ట్రంప్ చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్‌మీడియాలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘‘గత 24 గంటలుగా ట్రంప్‌ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్‌ మీటింగ్‌లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’’ అని ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.
మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్‌ సోషల్‌ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్‌ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్‌లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు. కొన్నిసార్లు సభల్లో తప్పులు మాట్లాడటం, నగరాల పేర్లు గందరగోళం చేయడం లాంటి విషయాలు కూడా ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ట్రంప్ టీమ్ మాత్రం "అతను బాగానే ఉన్నాడు" అని చెబుతోంది.
వాస్తవం ఏమిటి?
అమెరికన్ మీడియా చెబుతున్నది ఏంటంటే—ట్రంప్ నిజంగా ఎక్కడా కనిపించడం మానేయలేదు. కొన్ని రోజుల క్రితం ఆయన ర్యాలీల్లో పాల్గొన్నారు, పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించారు. కానీ ఒకేసారి సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లు పరిస్థితిని గందరగోళంగా మార్చేశాయి.
ఇంకా క్లారిటీ రాలేదు..
ప్రస్తుతం వైట్ హౌస్‌ నుంచి కానీ, ట్రంప్ అధికారిక బృందం నుంచి కానీ స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో, ప్రజలలో ఇంకా అనుమానాలు తగ్గలేదు. అమెరికాలోని పెద్ద మీడియా హౌస్‌లు మాత్రం "ట్రంప్ సేఫ్‌గానే ఉన్నాడు" అని చెబుతున్నాయి.
మొత్తానికి, ట్రంప్ కనిపించడం లేదన్న వార్తలు ఎక్కువగా సోషల్ మీడియా రూమర్లే. కానీ ఆయన ఆరోగ్యం, భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై ప్రశ్నలు మాత్రం అమెరికన్ మీడియాలో వేడెక్కుతున్నాయి.
Read More
Next Story