పంచాయతీ ఎన్నికల్లో ఎదురేలేదు వీరికి
x
in Panchati elections Vikaarabad District Record Break

పంచాయతీ ఎన్నికల్లో ఎదురేలేదు వీరికి

ఏకగ్రీవమైన పంచాయితీల్లో వికారాబాద్ జిల్లా అత్యధికం


తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఏక గ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు సభ్యుల వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వికారాబాద్ లో అత్యధికంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల్లో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఏకగ్రీవమయ్యారు. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 39 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో పోటీ లేకుండా 33 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ లో 29, నల్లగొండ లో 22 , యాదాద్రి భువనగిరిలో 16, సిద్దిపేటలో 16 , నిర్మల్ లో 16, మెదక్ లో 16 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జోగులాంబ గద్వాలలో 15, భద్రాది కొత్తగూడెంలో 14 , నాగర్ కర్నూలులో 14, నారాయణపేటలో 14, వరంగల్ లో 11, కామారెడ్డిలో 11, జనగామలో 10 మంది సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


రాజన్న సిరిసిల్లాలో 9 , ములుగులో 9, మహబూబాబాద్ 9, జయశంకర్ భూ పాలపల్లిలో 9, సంగారెడ్డిలో 7, సూర్యపేటలో 7, కొమురం భీంలో 7, మంచిర్యాలలో 6, రంగారెడ్డిలో 6, వనపర్తిలో 5, హనుమకొండలో 4, జగిత్యాలలో 4, పెద్దపల్లిలో 4, కరీంనగర్ లో 3 సర్పంచ్ స్థానాల్లో పోటీ లేకుండా గెలిచారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మేజర్ పంచాయతీలో పదేళ్ళుగా కొరెంగా గాంధారే సర్పంచుగా పనిచేసింది. మొదటిసారి ఎస్టీ జనరల్ అవటంతో ఈసారి గాంధారి భర్త సుంకరరావు పోటీలోకి దిగారు.


మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోను ఓ జంట రెండు దశాబ్దాలుగా సర్పంచ్ లుగా రాణిస్తున్నారు. కాసిపేట మండలం పల్లంగూడ పంచాయతీకి చెందిన దుస్స విజయ, చందు దంపతులు మూడుసార్లు సర్పంచిగా ఎన్నికయ్యారు. మళ్లీ ఈ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా నామినేషన్ వేశారు. కొమురంభీం జిల్లా వాంకిడి మండలం దాబా పంచాయతీ ప్రజలు పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రతీ ఎన్నికల్లో విలక్షణంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.


వాంకిడి మండలం ఖనరం గామ్ గ్రామపంచాయితీకి పెందూర్ మధుకర్-సుగంధ దంపతులు రెండు దశాబ్దాలు సర్పంచులుగా పనిచేశారు. కొమురంభీం జిల్లా తిర్యాణీ మండలంలోని గంభీరావుపేట గ్రామ పంచాయితీకి ముత్యం రాజయ్య-వరలక్ష్మి దంపతులు వరుసగా మూడు పర్యాయాలు సర్పంచు లుగా పనిచేశారు. కాగా ఈ నెల 11న తొలి విడతలో మిగిలిన 3,836 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.


ఏక గ్రీవ వార్డులు ఇవే

వార్డు సభ్యుల్లో ఏక గ్రీవంగా గెలిచిన అభ్యర్థుల్లో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానం లో నిలిచింది. ఆదిలాబాద్ లో 953 , వికారాబాద్ లో 652, నిజామాబాద్ లో 575, నిర్మల్ లో 471, కామారెడ్డిలో 433, నల్లగొండలో 375, జగిత్యాలలో 349, భద్రాద్రి కొత్తగూడెంలో 336, మెదక్ లో 332 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Read More
Next Story