నలుగురు ఐఏఎస్ లు రిలీవ్ అయ్యారు.. ముగ్గురు ఐఏఎస్ లు జాయినయ్యారు
తెలంగాణా హైకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణాలోని నలుగురు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయిపోయారు.
తెలంగాణా హైకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణాలోని నలుగురు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయిపోయారు. ఇదే సమయంలో ఏపీకి చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు తెలంగాణాలో జాయిన్ అయ్యారు. కాటా అమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని కలిసి రిలీవింగ్ ఆదేశాలను అందుకున్నారు. వీళ్ళు నలుగురు బుధవారం రాత్రి రిలీవ్ అయిపోయారు కాబట్టి బహుశా గురువారం ఉదయం ఏపీ చీఫ్ సెక్రటరీని కలిసి రిపోర్టు చేసే అవకాశముంది. ఇదే సమయంలో ఏపీలో రిలీవ్ అయిపోయిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీ సృజన, సీ. హరికిరణ్, తోలేటి శివశంకర్ శాంతికుమారికి రిపోర్టు చేశారు.
తెలంగాణా నుండి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారుల బాధ్యతలను జీహెచ్ఎంసీ కమీషనర్ గా ఇలంబర్తి, ఎనర్జీ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, మహిళా, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రేదేవి, టూరిజం శాఖ ప్రిన్సిపుల్ కార్యదర్శిగా ఆర్వీ కర్ణన్ కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కొత్తగా రిపోర్టుచేసిన ముగ్గురు ఐఏఎస్ లకు ఇంకా పోస్టింగులు ఇవ్వలేదు. అలాగే తెలంగాణా నుండి ఏపీకి వెళ్ళాల్సిన మరో ఐఏఎస్ అధికారి మల్లెల ప్రశాంతితో పాటు ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష భిస్త్, అభిషేక్ మహంతి విషయంలో ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నది తెలీలేదు. పైగా వీళ్ళు క్యాట్ లోకాని, హైకోర్టులో కాని డీవోపీటీ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తు కేసులు కూడా వేయలేదు.