చెన్నైలో అంశాలు హైద‌రాబాద్‌లో నెర‌వేరాయి...
x

చెన్నైలో అంశాలు హైద‌రాబాద్‌లో నెర‌వేరాయి...

పున‌ర్విభ‌జ‌న‌పై తెలంగాణ శాస‌న‌స‌భ‌లో మైలురాయిలా నిలిచిపోయే తీర్మానం చేసి రేవంత్ రెడ్డి త‌న మాట‌ల‌ను చేత‌ల్లో నిరూపించార‌ని సీఎం ఎంకే స్టాలిన్ కొనియాడారు.


పార్లమెంట్ నియోజ‌క‌వర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై తెలంగాణ శాస‌న‌స‌భ‌లో ఒక ముఖ్యమైన మైలురాయిలా నిలిచిపోయే తీర్మానం చేసి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న మాట‌ల‌ను చేత‌ల్లో నిరూపించార‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ కొనియాడారు. జనాభా ప్రాతిపదికన పున‌ర్విభ‌జ‌న‌ను వ్య‌తిరేకిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణ శాస‌న‌స‌భ‌ గురువారం తీర్మానం చేసిన నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు.


హైద‌రాబాద్‌లో రెండో కార్యాచరణ సమావేశం
చెన్నైలో ప్రతిపాదించిన అంశాలు హైద‌రాబాద్‌లో నెర‌వేరాయ‌ని, ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని,హైద‌రాబాద్‌లో ఐక్య‌కార్యాచ‌ర‌ణ స‌మితి రెండో స‌మావేశం నేప‌థ్యంలో మ‌రిన్ని రాష్ట్రాలు అదే బాట‌లో న‌డుస్తాయ‌ని త‌మిళ‌నాడు సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు.పున‌ర్విభ‌జ‌న విష‌యంలో తమిళనాడును అనుసరిస్తూ, ఈ చ‌ర్య‌ మన ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా ప్రతిఘటించే స‌మ‌ష్టిత‌త్వాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.భారతదేశ భవిష్యత్తును అధర్మ మార్గాన ఒక ప్రాంతానికి అన్యాయం చేసే రీతిన రాసేందుకు ప్రయత్నించే ఎవ‌రినీ అనుమ‌తించ‌బోమ‌ని స్టాలిన్‌ స్ప‌ష్టం చేశారు.

తమిళనాడు సీఎం ట్వీట్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో న్యాయం, సమానత్వం,సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టే ఫెయిర్‌డి లిమిటేషన్‌ను డిమాండ్ చేస్తూ ఒక మైలురాయి తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్ పోస్టులో వ్యాఖ్యానించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు జరపకుండా చేస్తున్న కసరత్తు పట్ల తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో లోక్‌సభ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించడంతో పాటు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రస్తుత సరిహద్దులను మార్పు చేయాలని కోరుతూ సభా నాయకుడు, ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది.దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


Read More
Next Story