
ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ(CBI) విచారణ కోరుతు ఎనుముల రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయటం కూడా డ్రామాలో భాగమే అన్నారు.
బీఆర్ఎస్ లో ఇపుడు జరుగుతున్నది అంతా కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామానే అని బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) కొట్టిపడేశారు. బీఆర్ఎస్(BRS) నుండి కవిత(Kavitha) సస్పెన్షన్ పై డీకే మాట్లాడుతు కవిత, కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) కలిసి ఆడుతున్న నాటకమని ఆరోపించారు. కాళేశ్వరం(Kaleshwaram Scam) అవినీతి, ఫార్ములా కార్ రేసు అవినీతి, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులనుండి జనాల దృష్టిని మళ్ళించేందుకు తండ్రి, కూతురు, కొడుకు కలిసి ఆడుతున్న నాటకంగా అరుణ అభివర్ణించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ(CBI) విచారణ కోరుతు ఎనుముల రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయటం కూడా డ్రామాలో భాగమే అన్నారు.
సీబీఐ విచారణకు రాష్ట్రప్రభుత్వం సహకరింస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. రాష్ట్రప్రభుత్వం విచారణలో సీబీఐకి సహకరించకుండా దర్యాప్తు సరిగా జరగటంలేదన్న నెపాన్ని సీబీఐ, కేంద్రప్రభుత్వం మీదకు నెట్టేసే కుట్ర రేవంత్ చేస్తున్నట్లు ఎంపీ మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ఆధిపత్యం కోసం అన్నా, చెల్లెళ్ళ మధ్య ఆధిపత్య గొడవలను కేసీఆర్ కంట్రోల్ చేయలేకపోయారని ఎంపీ దెప్పి పొడిచారు. అందుకనే అన్నా, చెల్లెళ్ళ మధ్య వివాదాలు పెరిగిపోయి కీచులాటలు పెరిగిపోయినట్లుగా ఇద్దరూ కలిసి డ్రామాను బాగా రక్తికట్టిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. పార్టీనుండి కవిత సస్పెన్షన్ కూడా డ్రామాలో భాగమే అని డీకే అరుణ అనుమానిస్తున్నారు.