జూబ్లీహిల్స్ ప్రచారంలో రేవంత్ షెడ్యూల్ ఇదే
x
Revanth reddy

జూబ్లీహిల్స్ ప్రచారంలో రేవంత్ షెడ్యూల్ ఇదే

ఈనెల 28వ తేదీన బహిరంగసభతో రేవంత్(Revanth) తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు.


జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఫైనల్ అయ్యింది. ఈనెల 28వ తేదీన బహిరంగసభతో రేవంత్(Revanth) తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అదేరోజు రోడ్డుషోలో కూడా పాల్గొంటారు. ఐదురోజుల్లో మొత్తం నాలుగు రోడ్డుషోలు, ఒక బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. బహిరంగసభ పోలీసు గ్రౌండులో జరుగుతుంది. అక్టోబర్ 30, 31 తేదీలు, నవంబర్ 4,5 తేదీల్లో రోడ్డుషోలుంటాయి. రోడ్డుషోల ద్వారా నియోజకవర్గంలోని(Jubilee Hills by poll) 6 డివిజన్లను రేవంత్ ప్రచారం చేయబోతున్నారు. కొందరు సినీ ప్రముఖులు కూడా కాంగ్రెస్(Telangana Congress) ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్ తరపున వల్లాల నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి సునీత, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీచేస్తున్నవిషయం అందరికీతెలిసిందే. ఉపఎన్నికలో మొత్తం 58మంది అభ్యర్ధులు పోటీచేస్తున్నారు. మామూలుగా అయితే ఉపఎన్నికలో ముఖ్యమంత్రి ప్రచారం చేయటం చాలా అరుదు. అయితే జూబ్లీ ఉపఎన్నికలో మాత్రం రేవంత్ ప్రచారం చేస్తున్నారు. కారణం ఏమిటంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవటం పార్టీకి ఎంత ముఖ్యమో వ్యక్తిగతంగా రేవంత్ కు కూడా అంతే ముఖ్యం. అందుకనే ఇక్కడ గెలుపుకోసం మంత్రులను ఇంచార్జిలుగా నియమించారు. వీళ్ళకు సాయంకోసం ఎంఎల్ఏలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, సీనియర్ నేతలు అన్నీ డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 11వ తేదీ పోలింగ్ జరిగి 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Read More
Next Story