
బతుకమ్మకుంట పునరుద్ధరణతో జలకళ
నాడు వెలవెల..నేడు జలకళ, ఇదీ బతుకమ్మ కుంటలో హైడ్రా తెచ్చిన పరివర్తన
కబ్జాలు,చెత్తకుప్పలతో అధ్వానంగా మారిన బతుకమ్మ కుంటను నేడు హైడ్రా పునరుద్ధరించింది.
కబ్జాలు, పేరుకుపోయిన చెత్తా చెదారం, మొలచిన పిచ్చిచెట్లతో నాడు వెలవెల పోయిన బతుకమ్మ కుంట(BathukammaKunta) నేడు జలకళతో సుందరంగా మారింది. హైడ్రా రంగంలోకి దిగి కబ్జాల పాలైన బతుకమ్మ కుంటను కోర్టులో న్యాయపోరాటం చేసి పరిరక్షించడంతోపాటు ఈ కుంట సుందరీకరణ పనులు చేపట్టింది. దీంతో కేవలం ఆరునెలల కాలంలోనే హైడ్రా బతుకమ్మ కుంటలో పరివర్తన తీసుకువచ్చింది.(LakeRejuvenation)బతుకమ్మ కుంట జలకళతో అందరినీ ఆకట్టుకోవడంతో వాకర్స్ సందడి ఏర్పడింది.
బతుకమ్మ కుంట నాడు ఇలా...
పిచ్చి చెట్లు, చెత్తాచెదారం పేరుకు పోయి బతుకమ్మ కుంట ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అధ్వానంగా కనిపించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రంగంలోకి దిగి కబ్జాలను తొలగించి పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించారు.
బతుకమ్మకుంటకు జలకళతో నేడు ఇలా...
బతుకమ్మకుంట సుందరీకరణ పనులు పూర్తి చేశాక ఈ ఏడాది జులై 7 వతేదీన ఏరియల్ వ్యూ ఫొటోలు తీయించారు.కుంట పునరుజ్జీవన పనులు వేగంగా , పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని పరివర్తన కనిపిస్తుందని హైడ్రా తెలిపింది. బతుకమ్మకుంట పూర్తి సరస్సు పునరుజ్జీవనం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని హైడ్రా అధికారులు చెప్పారు. సుందర బతుకమ్మకుంట ఈ ప్రాంత వాసులను ఆకట్టుకుంటోంది.
Next Story