
జబ్బార్ బస్ బోల్తా, ఒకరి మృతి
బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా దుర్ఘటన, ప్రయాణీకుల హాహాకారాలు
ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని దామాజిపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడడంతో ఒకరు మరణించారు. 44వ జాతీయ రహదారిపై ఓ ట్రక్కును ఢీ కొని జబ్బర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
జబ్బర్ ట్రావెల్స్ బస్సు (NL 01B 3382) ఐచర్ వాహనాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లా టేకులపల్లి వద్ద వి.కావేరీ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన మరువక మునుపే మరో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురికావడం గమనార్హం.
Next Story

