కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి
x

కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి

ఆసుపత్రిలో 20 మందికి చికిత్స


హైదరాబాద్ లో మంగళవారం నాడు కల్తీ కల్లు తాగిన ఘటనలో మొత్తం ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఇందులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తులసీరామ్ (47), బుజ్జయ్య(55) చనిపోతే ఇంట్లో మరొకరు చనిపోయారు. కల్తీ కల్లు ఘటనలో తాజాగా 65 ఏళ్ల నారాయణమ్మ మృతి చెందారు. కల్తీ కల్లు తాగిన ఘటనలో మొత్తం 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇంట్లోనే చికిత్స పొందుతున్న నారాయణమ్మ చనిపోయారు. వీళ్లంతా హెచ్ఎంటీ సాయిచరణ్ కాలనీకి చెందిన వారు అని పోలీసులు తెలిపారు.

ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి చికిత్సపొందుతన్న వారిని పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదు కల్లు కంపౌండ్ లను అధికారులు సీజ్ చేశారు. కల్తీ కల్లు ఘటనలో నిందితులను ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు ఇప్పటికే పరారయ్యారు.

బాధితులను కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. చనిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కల్తీ కల్లు ఘటనలో బాధితులను శేర్ లింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. కల్తీ కల్లును అరికట్టడానికి ఎక్సైజ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే చనిపోయారని అన్నారు. మెరుగైన వైద్యసాయం బాధితులకు అందించాలని వైద్యులను డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా 700 లీటర్ల కల్తీకల్లును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిజెపి మల్కాజ్ గిరి లోకసభ సభ్యుడు ఈటెల రాజేందర్ కూడా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలోకల్తీ కల్లు ఏరులై పారుతుదన్నారు

చనిపోయిన వారికి కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని ఈటెల డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత మంత్రి బాధ్యత వహించాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే కల్తీ కల్లు ఘటన జరిగిందని అన్నారు.

విషం చిమ్ముతోంది

తెలంగాణలో కల్తీ కల్లు విషం చిమ్ముతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఇటీవల వికారాబాద్‌లో కల్తీ కల్లు తాగి ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. 300 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన మరువకముందే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఆలూరులో మరో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి ఇద్దరు చనిపోయారు. మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. కాగా, కల్లులో ప్రమాదకర రసాయనాలను వినియోగించడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నట్లు అధికారులే తేల్చారు. అయినా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా అందులో ప్రమాదకర అల్పా జోలం (Alprazolam), డైజోఫామ్ రసాయనా ఉన్న కారణంగానే ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Read More
Next Story