జూబ్లిహిల్స్ టికెట్  ఇవ్వాలి: అంజన్ కుమార్ యాదవ్
x

జూబ్లిహిల్స్ టికెట్ ఇవ్వాలి: అంజన్ కుమార్ యాదవ్

మంత్రి కావాలన్న కోరికతో అడుగుతున్నా..


తనకు జూబ్లిహిల్స్ టికెట్ తో బాటు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కావాలన్న కోరికతో జూబ్లిహిల్స్ టికెట్ కోరుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రి వర్గంలో యాదవులకు ప్రాతినిద్యం లేదని అంజన్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. యాదవ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే సీనియర్ నేతను. నా కుమారుడికి యూత్ కాంగ్రెస్ కోటాలో రాజ్యసభ సీటు ఇచ్చినట్టు అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు.

కాంగ్రెస్ కష్ట కాలంలో సేవలందించినట్టు అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. రెండుసార్లు సికింద్రాబాద్ ఎంపీగా చేశానన్నారు. ఎపి మంత్రి వర్గంలో యాదవ కులానికి మంత్రి పదవి ఇచ్చారని, తెలంగాణలో మాత్రం ఒక్క మంత్రి పదవి రాకపోవడం శోచనీయమని అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు అభ్యర్థి అనేది అధికార కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు తేల్చలేదు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ మల్ల గుల్లాలు పడుతోంది. బీసీ పాట పాడుతున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లిహిల్స్ విషయంలో అభ్యర్థిని ఎంపిక చేయడంలో తాత్సారం చేయడంతో అసంతృప్త వాదుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. యాదవ సామాజిక వర్గం నియోజక వర్గంలో ప్రభావితం చేయవచ్చని పార్టీ నాయకత్వం భావిస్తుంది. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ జూబ్లిహిల్స్ టికెట్ తనదేనని ప్రచారం మొదలు పెట్టారు.

నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా..

మాజీ క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. యువతలో ఆయనకు మంచి ఫాలోఅప్ ఉంది. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ నాయకులతో వరుసగా భేటీ అవుతున్నారు. బీసీలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ యాదవ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. తనకు టికెట్ ఇస్తే మైనార్టీల వోట్లు కూడా పడతాయని నవీన్ యాదవ్ ధీమాగా ఉన్నారు.

2023 ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ గెలిచారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు స్వంతం చేసుకున్నారు. ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Read More
Next Story