తెలంగాణలో పులివేట వీరగల్లులు
x

తెలంగాణలో పులివేట వీరగల్లులు

మూడు శిల్పాలను కొమురవెల్లి సమీపాన ఉన్న గౌరాయపల్లిలో గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్


ప్రసిద్ధ మల్లన్న క్షేత్రం కొమురవెల్లి సమీపాన ఉన్న గౌరాయపల్లిలో పరిశోధకుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ గ్రామంలోని వీరగల్లులను గుర్తించాడు. అవి 17వ శతాబ్దానికి చెందినవి. గ్రామం మీద దాడిచేసిన పెద్దపులితో పోరాడి, ప్రజల్ని కాపాడి అమరులైన వీరులను స్మరిస్తూ వేసిన వీరశిలలివి.

తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడుతూ కన్నడ భాషలో ‘హుళిబేటె’ అని పిలిస్తారని అన్నారు. ఈ పులివేట వీరగల్లులు తెలంగాణలో మూటకోడూర్, నిజామాబాద్, గోనెపల్లి, అమ్మనబోలువంటి పలుచోట్ల లభించాయని చెప్పారు.




గౌరాయపల్లిలో గుర్తించబడిన వీరగల్లుల మూడు శిల్పాలో రెండు పులితో వేటాడుతున్నవి. మూడవ శిల్పంలో వీరునీ తల వెనక జడకట్టు వుంది. అతని చెవులకు కుండలాలున్నాయి. ఈ మీసాలవీరుడు పులిని రెండుచేతులా పట్టుకుని పోరాడుతున్నాడు. మరొక వీరుడు ఎడమచేతిని మడిచి పులినోట్లో కుక్కి, ఎడమకాలితో పులికాళ్ళను అడ్డుకుంటు, కుడిచేత కత్తితో దాడిచేస్తున్నాడు. నడినెత్తిన సిగవుంది. శైలినిబట్టి ఈ వీరగల్లులు 17,18 శతాబ్దాలనాటివి అని హరగోపాల్ చెప్పారు.



అక్కడి మూడో వీరగల్లు ప్రత్యేకమైనది. ఇది కన్నడంలో ‘సిడితల’ అని పిలువబడే ‘గడతల’ వీరగల్లు. ఇందులో శైవభక్తుడు తన సిగముడిని వంచిన వెదురుగడకొసకు కట్టుకుని అంజలిపట్టి యోగాసనంలో కూర్చున్నాడు. పక్కన కత్తిచేతపట్టి అతని మెడ నరకబోతున్న వ్యక్తి కనిపిస్తున్నాడు. పై అంతస్తులో దైవసాన్నిధ్యాన్ని పొందిన వీరుడు కనిపిస్తున్నాడు. ఇది శైలినిబట్టి రాష్ట్రకూటుల కాలంనాటిది. తెలంగాణాలో ‘గడతల’ వీరగల్లులు పదుల సంఖ్యలో లభించాయి. తనకు తానే వెదురుగడకు సిగకట్టుకుని, తల నరుక్కునే వీరశిలలతోపాటు, వేరొకరి సాయంతో శిరఃఖండన చేయించుకునే గడతల వీరగల్లులు తక్కువ. రాయలసీమ కడప మ్యూజియంలో ఇటువంటి వీరగల్లులున్నాయని ఆయన అన్నారు.


Read More
Next Story