తిలక్ వర్మను సన్మానించిన సీఎం
x

తిలక్ వర్మను సన్మానించిన సీఎం

ఆసియా కప్ ఫైనల్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ.


ఆసియా కప్-2025లో భారత్ విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించాడు. వరుస వికెట్లు పడుతున్న ఒత్తిడి సమయంలో నిలబడి జట్టును విజయ పథంలో నడిపించాడు. అదిరిపోయే గేమ్ ప్లేతో టీమిండియాకు ట్రోఫీని అందించడంలో ప్రధానంగా నిలిచాడు. కాగా టోర్నీ ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. ఆసియా కప్ టోర్నీలో అతడు కనబరిచిన ఆటతీరుకు అభినందించారు. తెలంగాణ పేరు నిలబెట్టారనన్నారు.

హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను, కోచ్ సలాం బయాష్‌ను ముఖ్యమంత్రి సత్కరించారు. తిలక్ వర్మ తన క్రికెట్ బ్యాట్‌ను ముఖ్యమంత్రికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ చైర్మన్ శివసేనా రెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు.

Read More
Next Story