బీసీలు జ్ఞాన యుద్ధానికి సన్నద్ధం కావాలి
x

'బీసీలు జ్ఞాన యుద్ధానికి సన్నద్ధం కావాలి'

"భావ సంఘర్షణ ఎన్ని పోరాటాలు చేసినా విజయం సాధించలేం."


చిన్న పక్షి కూడా తన సొంత గూడు నిర్మించుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు 78 ఏళ్ల తర్వాత రాజకీయ అధికారం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేసుకున్నాము.

బీసీల జ్ఞానం కేవలం మేధోసంపద పోగేసుకోవడం కోసం కాదు. వ్యక్తి బతుకుదెరువుకు మార్గం మాత్రమే కాదు. భుజకీర్తులు తగిలించుకోవడం కోసం కాదు. అస్తిత్వాన్ని ప్రకటించుకోవడం కోసం కాదు. భజనపరుల మెప్పు కోసం కాదు. జ్ఞానం ఆధిపత్య కులాల పార్టీలను విధ్వంసం కోసం పని చేయాలి.

“ప్రతి బీసీ బుద్ధిజీవే” ప్రతి ఒక్కరికీ ఆలోచించే, విశ్లేషించే, సమాజాన్ని ప్రభావితం చేసే పనిబట్టే వాళ్లకు బుద్ధిజీవులుగా గుర్తింపు వస్తుంది తప్ప వాళ్ల ఫలానా వర్గంలో, జాతిలో పుట్టడం వల్ల కాదు. రాజనీతి శాస్త్రవేత్త గ్రాంసీ బుద్ధిజీవులు రెండు రకాలుగా ఉంటారని అంటాడు. వాళ్లు ఆర్గానిక్ బుద్ధిజీవులు, ట్రెడిషనల్ (సాంప్రదాయ) బుద్ధి జీవులు.

ఆర్గానిక్ బుద్ధిజీవులు

ఆ వర్గ అవసరాలను, ఆశయాలను ప్రాతినిధ్యం వహిస్తూ సమాజంలో కొత్త ఆలోచనలను, వ్యూహాలను రూపొందిస్తారు. ఉదాహరణకు, బీసీ కులాల నుండి పుట్టిన బీసీ మేధావులు ఆ కులాల ఆర్థిక సమానత్వం, శ్రమ హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆలోచనలను, ప్రణాళికలను రూపొందించి ప్రజలను చైతన్యవంతం చేస్తారు.

సంప్రదాయ బుద్ధిజీవులు చరిత్రాత్మకంగా ఉన్న దోపిడీ కులాల పార్టీలో పనిచేస్తూ, అణిచివేత నిర్మాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తారు. వీరు విద్యా, మతం, చట్టపరమైన వ్యవస్థల ద్వారా ఆధిపత్య శక్తులకు మద్దతు ఇస్తారు. సమాజంలో యధాతథ స్థితిని కొనసాగించడంలో సహాయపడతారు. వీళ్లను ఇంటలెక్చువల్ స్లెవ్స్ అని కూడా అంటారు.వీరు బీసీ ఉద్యమాలకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తారు.

దోపిడీ పాలక వర్గాలు బీసీల మీద అధికారాన్ని చలాయించడానికి విద్య, మీడియా, మతం వంటి వాటిని ఆయుధాలుగా వాడుకుంటారు.

ఒకవైపు ఇలాంటి విద్యా సంస్కృతిని పెంచిపోషిస్తూనే, మరోవైపు పీడిత వర్గాల, జాతుల, కులాల అధ్యాపకుల మీద, విద్యార్థుల మీద అనేక రూపాలలో పెత్తనం కొనసాగిస్తారు. వీటికి తోడు అధ్యాపకులు ఏమి బోధించాలో, ఎలా బోధించాలో పెట్టే నిబంధనలు విద్యా వ్యవస్థలో కొనసాగే బల ప్రయోగంలో భాగమే. అంతేకాదు, కోట్లాది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవడం కూడా పాలక వర్గాలు అమలుచేసే వ్యవస్థీకృత బల ప్రయోగంలో భాగమే. భూస్వామ్య, అర్థ భూస్వామ్య సమాజాల్లో ఎవరు ఏం చదువుకోవాలి? ఎట్లా చదువుకోవాలి? అని పెట్టే కట్టుబాట్లలో సమ్మతి, బలం కలిసి దాడి చేస్తాయి.

అందుకే బీసీ మేధావులు భావజాలం తయారు చేయడంలో వ్యక్తికి ఒక విషయాన్ని విమర్శనాత్మకంగా ఆలోచించి, అర్ధం చేసుకునే స్థాయిని కలిగించేలా ఉండాలి (fundamental power to think). ప్రశ్నించే తత్వము సమాజ పురోగతికి ఇంధనం లాంటిది. అది సైన్స్ అయినా, చరిత్ర అయినా ప్రశ్నల సమ్మెట దెబ్బలు తింటేనే సత్యం బయటపడుతుంది. ఆదిపత్య కులాలకు భజన చేస్తే రాజ్యాధికారం ఎన్నటికీ రాదు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన పదేండ్ల పరిపాలనలో ప్రశ్నించేవాడు ఉండకూడదనే విద్య అభివృద్ధి చెందకుండా కుట్ర చేశాడు. నిధులను కేటాయించలేదు.ఈ దోపిడీ కులాల పార్టీలు తమ చేతిలోని రాజ్య యంత్రాంగాన్ని, దాని అజమాయిషీలో నడిచే అన్ని వ్యవస్థలను, సంస్థలను ఉపయోగించుకొని తమ కులాల వారిని ఉద్యోగులుగా నియమించుకుంటారు.

పరిపాలనను తమ చెప్పుచేతుల్లో ఉంచుకోవడం కోసం అవసరమైన చోట సమ్మతి కోసం ప్రయత్నిస్తారు. అది వీలుకాకపోతే బలాన్ని వాడుతారు. సాంస్కృతిక ఆర్థిక ఆధిపత్యాన్ని ఉపయోగించి ప్రజల మద్దతు పొందుతారు. ప్రజలను మాయ చేసి మభ్యపెట్టి ప్రజలను తమ కబ్జాలో ఉంచుకుంటారు. దేశభక్తి పేరుతో తప్పుడు ప్రచారం చేస్తారు.అందుకే ప్రజల భాషలో బీసీ భావజాలను తీసుకెళ్లాలి. భావజాలం ద్వారా ప్రజలతో కలిసిపోయి జ్ఞాన యుద్ధం చేయాలి. ఆ తర్వాత ఉద్యమాల ద్వారా ఆధిపత్యకులాలను ఓటు అనే ఆయుధం ద్వారా ఓడించాలి. చరిత్రలో పోరాటం ద్వారానే హిట్లర్,ముస్సోలిని కాలగర్భంలో కలిసిపోయారు. అందుకే బీసీ భావజాలం, రాజకీయ ఉద్యమం ఏకకాలంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలి.

సమాజంలో రాజకీయ మార్పు రావాలంటే బీసీలకు అర్ధమయ్యే విధంగా వాళ్ల భాషలో, వారి జీవితాలతో మమేకం కావాలి. అలా చేయడం ద్వారానే వాళ్లమీద రుద్దబడే ఆధిపత్య భావజాలాన్ని passive గా స్వీకరించకుండా దానితో సంఘర్షించగలుగుతారు. ఆ భావ సంఘర్షణ, counter-hegemony లేకుండా ఎన్ని పోరాటాలు చేసినా విజయం సాధించలేం. ప్రజలకు సత్యం చెప్పడం ద్వారా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రజల్లో విప్లవం తీసుకొచ్చాడు.

రెడ్ల, వెలుమలను రాజకీయంగా ఓడించడం ఎట్లా?

రెడ్లు వెలమలు తమ పరిపాలన పదిల పర్చుకోవడానికి బీసీల మీద దాడులను చేసి, చరిత్రను వక్రీకరిస్తారు. అసత్యాలను ప్రచారం చేస్తారు. పుక్కిటి పురాణాలకు శాస్త్రీయతను అంటగడుతారు. అశాస్త్రీయతే విశ్వ గురువుగా ప్రచారం చేస్తారు. ఇవన్నీ సజావుగా జరగాలనే ప్రశ్నించే గొంతుకలను నిర్బంధిస్తున్నారు. ఆ ప్రశ్నలను పుట్టించే వ్యవస్థలను (విద్యా వ్యవస్థతో సహా) ధ్వంసం చేస్తారు. గతంలో తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తున్నాడనే నిర్బంధించి, జైల్లో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందారు.

ఇప్పుడు భావజాల రంగంలో సంస్కృతి, జీవన విధానం పేరిట ప్రజల మెదళ్లను ఆక్రమించిన ఆధిపత్య భావజాలాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చాల్సిన అవసరం ఎంతో వుంది. ఎందుకంటే అసెంబ్లీలో ఆధిపత్య కులాల పార్టీలు ఓడిపోవచ్చు. కానీ, సంస్కృతి ముసుగులో అమ్ముడుపోయిన బీసీలు మన చుట్టూ ఉంటారు. మనలోనూ ఉంటారు. కాబట్టి ఈ పార్టీలను ఓడించడానికి సాంస్కృతిక విప్లవంలో భాగంగా జ్ఞానయుద్ధం చేయాల్సిన అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకోసం

ఐక్యపోరాటాల ద్వారానే విజయం సాధిస్తాం. అన్ని స్థాయిల్లో ఎవరు చేయదగిన ప్రతిఘటన పోరాటాలు వాళ్లు చేయాలి.

Read More
Next Story