
ఫేక్ ఐడిలతో టాలివుడ్ హీరోయిన్లు..!
వైరల్ అవుతున్న సమంత, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా ఓటర్ ఐడీలు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో టాలివుడ్ హీరోయిన్ల ఫోటోలు ఫేక్ ఓటర్ ఐడి లిస్టులోకనబడుతున్నాయి. తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు ఓటర్ లిస్ట్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది. ఓటర్ల జాబితాలో టాలివుడ్ హారోయిన్ల ఫొటోలు కనబడేసరికి హైదరాబాద్ ఎన్నికల అధికారులు ఎంక్వైరీ ప్రారంభించారు. అధికారులు రూపొందించిన జాబితాలో హీరోయిన్ల పేర్లు ఉన్నయా? లేవా? అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో హీరోయిన్ల ఫోటోలను వేరే వోటర్ ఐడి కార్డులపై అతికించిన ఘటనలో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎవరి ప్రోద్బలంతో ఈ ఫేక్ ఐడి కార్డులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఆరా తీస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి ఏ అధికారులు సహకరిస్తున్నారో అనే విషయాలు తెలియాల్సి ఉంది.
జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయపార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. బిఆర్ఎస్ కు టాలివుడ్ ఇండస్ట్రీకి ఇంతవరకు సపోర్ట్ గా నిలిచింది. గత ఎన్నికల్లో వీళ్ల వోట్ల శాతం బాగా తగ్గింది. దివంగత బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బిఆర్ఎస్ నుంచి మాగంటి సతీమణి సునీత పోటీ చేస్తున్నారు. మాగంటి సినీ ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తి కావడంతో టాలివుడ్ లో పరిచయాలున్నాయి. ఆయన వరుసగా మూడు పర్యాయాలు గెలవడానికి టాలివుడ్ ఇండస్ట్రీ , కారణమైంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బిజెపి నుంచి లంకల దీపక్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది.