
రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ,రూ.562 కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన రెండోరోజు కొనసాగింది. రుద్రారంలో కొత్త ఫ్యాక్టరీ కోసం రూ.562 కోట్లు పెట్టేందుకు తోషిబా అంగీకరించింది.
తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది.విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.వీటితో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేయనుంది.
ముఖ్యమంత్రి @revanth_anumula గారి నేతృత్వంలోని రైజింగ్ తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లోని టోక్యో వాటర్ ఫ్రంట్‌ను సందర్శించింది. టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
— Telangana CMO (@TelanganaCMO) April 18, 2025
టోక్యో నగరం మధ్యన జల రవాణాకు… pic.twitter.com/xqyKd3FEle
టోక్యో మహానగరం మధ్య నుంచి పారే సుమిదా నది రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.టోక్యో నగరం మధ్యన జల రవాణాకు అనుగుణంగా రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడం, సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చిందీ సీఎం రేవంత్ ప్రతినిధి బృందం పరిశీలించింది.