Mahesh Kumar Goud
x

సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

తనకు మంత్రి పదవిపై ఆశలేదన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.


తనకు తెలంగాణ మంత్రివర్గంలోకి రావాలన్న ఆశ, ఆలోచన ఏమాత్రం లేవని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అదే విధంగా తనకు, సీఎం రేవంత్‌కు మధ్య ఎటువంటి విభేదాలు లేవని కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం తనకున్న పదవితో తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. అయితే ఆయన మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కానీ, సీఎం రేవంత్‌తో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయని అసలు ఎవరు ప్రశ్నించారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇదే క్రమంలో అది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ప్రచారం అని, మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారన్న అంశం కూడా అందులో ఒకటేనన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కానీ వీటిపై పబ్లిక్‌గా క్లారిటీ ఇస్తున్నారంటే.. ప్రచారం చాలా తీవ్రంగా జరిగి ఉంటుందన్న చర్చ మొదలైంది.

నాకా ఆరాటం లేదు..

‘‘పార్టీలో నేను ఆర్గనైజషన్ నుంచి వచ్చాను. పార్టీ అప్పగించే బాధ్యత ఏదైనా దాన్ని నిర్వర్తిస్తాను. నేను మంత్రి వర్గంలోకి వెళ్లడం కోసం ఏమాత్రం ఆరాటపడటం లేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. నాకు సీఎంతో పాటు మంత్రివర్గం పూర్తిగా సహకారం అందిస్తున్నారు. నాకూ, సీఎం రేవంత్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని, గ్యాప్ పెరిగిందన్న ప్రచారాల్లో వాస్తవం లేదు. మా మధ్య అంతా బాగానే ఉంది’’ అని ఆయన చెప్పారు. కొందరు కావాలనే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

అనంతరం ఆయన బీజేపీపై కీలక విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణలో ఓట్ చోరీ జరిగిందని, అందుకు ఆధారాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో అందుకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఓల్డ్ సిటీలో ఆధారాలను ఫిరోజ్ ఖాన్ బహిర్గతం చేశారని కూడా పేర్కొన్నారు. అనంతరం ఫిరాయింపు నేతల అంశంపై స్పందిస్తూ.. ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక తప్పదన్న ప్రచారాలను ఆయన ఖండించారు. ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక వస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ‘‘ఫిరాయింపు వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉంది. దానం నాగేందర్ మా పార్టీ విధానాలు నచ్చి మాతో ప్రయాణిస్తున్నాడు. జూబ్లీహి్స్ ఎన్నికల్లో కేసీఆర్.. ఎందుకు ప్రచారం చేయలేదో ఆ పార్టీ నేతలే చెప్పాలి. ఇంపార్టెంట్ వ్యక్తులకు కేసీఆర్ నుంచి ఫోన్లు వెళ్లినట్లు మాకు సమాచారం ఉంది’’ అని చెప్పారు.

Read More
Next Story