
Open Letter to KCR | కేసీఆర్‌కు టీపీసీసీ బహిరంగ లేఖ,ఇందులో ఏముందంటే...
కేసీఆర్ కు టీపీసీసీ ఆదివారం ఒపెన్ లెటరు రాసింది. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కోరారు.
‘‘తెలంగాణ ఆవిర్భవించాక పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తూ ఎర్రవెల్లి ఫాం హౌస్‌కే పరిమితం అయ్యారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మీరు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి’’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ శనివారం కేసీఆర్ కు రాసిన లేఖలో కోరారు. గడీల పాలన చేసిన మీరు ప్రజారంజక పాలనను విమర్శిస్తే ప్రజలు హర్షించరని,తరిమికొడతారని గౌడ్ పేర్కొన్నారు. అద్భుత పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి బృందంపై అవాకులు, చవాకులు మాని , ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.
- తెలంగాణ కోసం దీక్ష పేరుతో కేసీఆర్ నాటకం ఆడి యువకుల బలిదానాలకు కారణమయ్యారని టీపీసీసీ అధినేత మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మీ అల్లుడు హరీశ్ రావు పెట్రోల్ డబ్బా, అగ్గిపుల్లలతో డ్రామాలు ఆడి అమాయక యువతను బలిదానాల వైపు ప్రోత్సహించారని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక మీ కుటుంబంలోని సభ్యులకే రాజకీయ ఉపాధి కల్పించి, అరకొర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి వాటిపై మీ అనుచరులతోనే కోర్టుల్లో కేసులు వేయించారని గౌడ్ చెప్పారు.
- జాబ్ క్యాలెండరును విడుదల చేసి, ఏడాదికాలంలోనే 54వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించిన ప్రజా ప్రభుత్వంపై మీ పార్టీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని గౌడ్ ఆరోపించారు.
- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి పాల్పడి, ఏటీఎంలా మార్చారని, తెలంగాణ నిధులను దోచుకున్నారని, ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ నేతలు పేదల భూములను కొల్లగొట్టారని టీపీసీసీ అధ్యక్షుడు గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
- బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని, తాము విగ్రహం ఏర్పాటు చేస్తే విగ్రహ రూపురేఖలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మహేష్ కుమార్ విమర్శించారు.
Next Story