
మీకో రూల్ మాకో రూల్
ట్రాఫిక్ చలాన్లను పట్టించుకోని పోలీసన్న
హెల్మెట్ లేదనో, కారు సీటు బెల్టు లేదనో ఎడా పెడా చలాన్లు వేసే ట్రాఫిక్ పోలీసులు అదే శాఖకు చెందిన పోలీసు వాహనాలను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు జారి చేసిన ఏకంగా 17 వేల 391 చలాన్లు అటకెక్కాయి. ఈ జరిమానాల చెల్లింపుల్లో ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసులను ట్రాపిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. వారి ముక్కు పిండి వసూలు చేయకుండా మిన్నకుండిపోవడంతో పోలీసు శాఖ వాహనాలు దర్జాగా రోడ్ల మీద స్వైర విహారం చేస్తున్నాయి. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 210 బి ప్రకారం చలాన్లు రెట్టింపు చేయాలి. పెండిగ్ లో ఉన్న చలాన్ల విలువ అక్షరాల 68 లక్షలు అని చెబితే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. ఒక వేళ రెట్టింపు అయితే మాత్రం మొత్తం కోటి 36 లక్షలు కట్టాల్సిందే. విషయం బయటకు పొక్కడానికి కారణం హైద్రాబాద్ వాసి లోకేంద్ర సింగ్. సమాచార హక్కుచట్టం క్రింద విషయం బయటకు పొక్కింది.