తెలంగాణలో 13 మంది ఐఎఎస్ అధికారుల బదిలీలు
x

తెలంగాణలో 13 మంది ఐఎఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణలో సోమవారం 13 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.


తెలంగాణలో 13 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ జీఓఆర్టీ నంబరు 1494 పేరిట సోమవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేశారు.

- తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ ను వైఏటీ అండ్ సీ డిపార్టుమెంట్ కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనరుగా ఉన్న ఈ ధర్ ను బీసీ వెల్ఫేర్ కార్యదర్శిగా బదిలీ చేశారు.
- అనితా రామచంద్రన్ ను మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ డిపార్టుమెంట్ సెక్రటరీగా, కె ఇలంబర్తిని జీహెచ్ఎంసీ కమిషనరుగా నియమించారు. గనుల శాఖ కార్యదర్శి కె సురేంద్ర మోహన్ ను రవాణ శాఖ కమిషనరుగా బదిలీ చేశారు. చేవ్వూరు హరికిరణ్ ను ఎక్సైజ్ శాఖ డైరెక్టరుగా నియమించారు.
- డి కృష్ణ భాస్కర్ ను ట్రాన్స్ కో సీఎండీగా, శివశంకర్ లహోటీని ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓగా, జి శ్రీజనను పంచాయితీరాజ్ డైరెక్టరుగా , చిట్టెం లక్ష్మీని ఆయుష్ డైరెక్టరుగా బదిలీ చేశారు. కార్మిక శాఖ డైరెక్టరు కృష్ణ ఆదిత్యను ఇంటరు బోర్డు కార్యదర్శిగా, సంజయ్ కుమార్ ను కార్మిక శాఖ కార్యదర్శిగా, డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ను జీఏడీ సెక్రటరీగా నియమించారు.


Read More
Next Story