ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త కోణం.. ఆ గవర్నర్ ఫోన్ కూడా..
x

ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త కోణం.. ఆ గవర్నర్ ఫోన్ కూడా..

తెలంగాణ ఫోన్ టాపింగ్‌లో విస్తుబోయే అంశం ఒకటి బయటకొచ్చింది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు.


తెలంగాణ ఫోన్ టాపింగ్‌లో విస్తుబోయే అంశం ఒకటి బయటకొచ్చింది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 2023 నవంబర్ నుంచి 15రోజుల పాటు ఆయన ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనా రెడ్డి పీఏను కూడా పోలీసులు విచారించారు. ఆయన విచారణలోనే ఈ విషయం బహిర్గతమైనట్లు తెలుస్తోంది. అమెరికాలో ఉన్న కొందరు నిందితులు తిరిగి వస్తే ఈ కేసులో కీలక విషయాలు తెలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. అందుకోసమే అమెరికాలో ఉన్న నిందితులను వీలైనంత త్వరగా తిరిగి తీసుకురావడానికి అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, భారత్ మధ్య ఉన్న నిందితుల అప్పగింత ఒప్పందం కింద వారిని భారత్‌కు తిరిగి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

పోలీసుల ప్రయత్నాలిలా

పోలీసు అధికారులకు ట్యాపింగ్ ఆదేశాలిచ్చింది మాజీ చీఫ్ అన్న విషయంలో క్లారిటి వచ్చేసింది. అయితే ఎవరి ఆదేశాలతో మాజీ చీఫ్ వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించారన్న విషయం సస్పెన్సుగా ఉండిపోయింది. ఎవరి ఆదేశాల ప్రకారం మాజీ చీఫ్ వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించారు ? తెరమీద ప్రభాకరరావు పేరు స్పష్టమైపోయింది. మరి తెరవెనుకుండి మాజీచీఫ్ ను ఆదేశించింది ఎవరు ? అన్న పాయింట్ దగ్గరే ట్యాపింగ్ విచారణ ఆగిపోయింది. ముఖ్యపాత్రదారి ప్రభాకరరావు దొరికితేనే తెరవెనుక ఉండి వేలాది ఫోన్ల ట్యాపింగుకు ఆదేశాలిచ్చిన సూత్రదారి ఎవరన్న విషయం బయటపడదు. సూత్రదారి దొరకాలంటే ముందు పాత్రదారి దొరకాలికదా. కాని పాత్రదారేమో ట్యాపింగ్ విచారణలో మొదటి అరెస్టు జరగ్గానే మరుసటిరోజు అమెరికాకు పారిపోయాడు. అప్పటినుండి పాత్రదారిని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేయనిప్రయత్నాలులేవు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పాత్రదారిని అమెరికా నుండి రప్పించలేకపోతున్నారు. మనచట్టాలు కూడా ప్రభాకరరావును అమెరికా నుండి రప్పించలేకపోతున్నాయి.

అందుకనే చివరి ప్రయత్నంగా ‘లెటర్ ఆఫ్ రొగెటరీ’(ఎల్ఆర్) అనే పద్దతిని ఫాలో అవబోతున్నారు. లెటర్ ఆఫ్ రొగెటరీ అంటే అమెరికాలో పాత్రదారి ఉంటున్న ప్రాంతంలోనే విచారించటం. అందుకు పాత్రదారి ఉంటున్న ప్రాంతంలోని న్యాయస్ధానం అంగీకరించాలి. ఇది ఎలాగ జరుగుతుందంటే తెలంగాణ పోలీసులు ట్యాపింగు కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణను తెలంగాణ హైకోర్టుకు వివరించాలి. అమెరికాలో ఉంటున్న ప్రభాకరరావు పాత్రకు సంబందించిన అన్ని ఆధారాలను కోర్టుకు చూపించాలి. పాత్రదారి అమెరికా నుండి బయటకు రావటానికి నిరాకరిస్తున్న విషయాన్ని చెప్పి, విచారణలో జరుగుతున్న ఆలస్యాన్ని వివరించాలి. దర్యాప్తు పూర్తవ్వాలంటే ప్రభాకరరావును విచారించటం ఎంతముఖ్యమో పోలీసులు హైకోర్టును కన్వీన్స్ చేయాలి. కోర్టు గనుక కన్వీన్స్ అయితే లెటర్ ఆఫ్ రొగెటరీని జారీచేస్తుంది. అంటే నిందితుడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోనే విచారించేందుకు ఇచ్చే అనుమతి అన్నమాట.

Read More
Next Story