Twin Murders | హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసిన జంట హత్యలు
x

Twin Murders | హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసిన జంట హత్యలు

హైదరాబాద్ శివార్లలో వెలుగుచూసిన జంట హత్యల కేసు సంచలనం రేపింది.పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద ఓ యువతి, యువకుడి మృతదేహాలు వెలుగుచూశాయి.


సంక్రాంతి పండుగ సందర్భంగా యువకులు గాలిపటాలను ఎగురవేసేందుకు మంగళవారం పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టల వద్దకు వచ్చారు. అక్కడ ఓ యువతి, యువకుడి శవాలు ఉండటం చూసి భయాందోళనలకు గురై వారు పోలీసులకు సమాచారం అందించారు.

- గుట్టల వద్ద పొదల్లో రెండు మృతదేహాలున్నాయని పోలీసు డయల్ 100 కు ఫోన్ చేశారు. అంతే రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, పోలీసు బృందాలతో కలిసి సంఘటన స్థలానికి వచ్చారు.
- ఓ యువతి, యువకుడి మృతదేహాలుగా గుర్తించి వాటిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యువతీ, యువకుడిని చంపి తలను బండరాయితో మోది చంపి, మృతదేహాలను దహనం చేశారు. మృతులు కూలీలుగా భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఒంటిపై ఉన్న దుస్తులు, షూస్ ను బట్టి కూలీలని, వారు ఇతర రాష్ట్రాల వారని పోలీసులు పేర్కొన్నారు.
- ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు లభించడంతో హంతకులు మద్యం తాగి యువతిపై అత్యాచారం చేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలతో త్వరలో నిందితులను పట్టుకుంటామని నార్సింగి పోలీసులు చెప్పారు.


Read More
Next Story