హన్మకొండ జిల్లాలో విషాదం
x
Road Terror

హన్మకొండ జిల్లాలో విషాదం

చెట్టును కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృత్యువాత


హన్మకొండ జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు.. చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఆత్మకూరు మండలం కొత్త గట్టు శివారులో గురువారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం హన్మకొండ జిల్లా రేపాక పల్లికి చెందిన పార్శ సంపత్, హనుమకొండ జిల్లా పరకాల మండలానికి చెందిన బొంపల్లి కిషన్, వెంకటేశ్ , ఆత్మకూరుకు చెందిన చింతపట్ల మురళీకృష్ణ పరకాల నుంచి కారులో హనుమకొండ వైపు వెళ్తున్నారు. వారు కారును అతివేగంగా నడుపుతున్నారు. ఒక్కసారిగా కారు అదుపుతప్పడంతో చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పార్శ సంపత్, బొంపల్లి కిషన్ స్పాట్‌లోనే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మురళీకృష్ణ, వెంకటేష్‌లను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి చేర్చారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలె జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు.

Read More
Next Story