
బిగ్ బ్రేకింగ్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి
యాదాద్రిజిల్లాలోని చౌటప్పుల్ దగ్గరకు రాగానే కైతవరం గ్రామం దగ్గర రోడ్డుపక్కనే ఆగివున్న లారీని వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో బలంగా ఢీకొన్నది
ఇద్దరు పోలీసు అధికారులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. విజయవాడ నుండి హైదరాబాద్ కు వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో డీఎస్పీలు మేక చక్రధరరరావు, శాంతారావుగా గుర్తించారు. ఇదే ప్రమాదంలో(Road Accident) మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. వీరంతా ఏపీ పోలీసుశాఖలో పనిచేస్తున్నారు. విజయవాడ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటి వింగ్ లో పనిచేస్తున్న వీరంతా విధులు ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాదు(Hyderabad)కు బయలుదేరారు. యాదాద్రిజిల్లాలోని చౌటప్పుల్ దగ్గరకు రాగానే కైతవరం గ్రామం దగ్గర రోడ్డుపక్కనే ఆగివున్న లారీని వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో బలంగా ఢీకొన్నది. స్కార్పియో వేగంగా వస్తున్న కారణంగానే తెల్లవారిజామున ఆగివున్న లారీని డ్రైవర్ చూసుకోలేదని ప్రాధమికసమాచారం. డ్రైవర్ నిద్రమత్తలో ఉన్నాడని యాదాద్రిపోలీసులు అనుమానిస్తున్నారు. డీఎస్పీలతో పాటు మరో అడిషినల్ ఎస్పీ ప్రసాద్, కూడా ప్రయాణిస్తున్నారు. అడిషినల్ ఎస్సీతో పాటు డ్రైవర్ నరసింహులుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.