
లారీని ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు ఘటనలో ఇద్దరి మృతి
జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం
చేవెళ్ల ఘటన మరువ ముందే తెలంగాణలోమరో ఆర్టీసి బస్సు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెందారు. చేవెళ్ల ఘటనలో ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమని అధికారులు తెలిస్తే జనగామ బస్సు ప్రమాదానికి ఆర్టీసి డ్రైవర్ నిర్లక్యమని తెలుస్తోంది.
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడిగొండ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న ఇసుక లారీని వరంగల్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొంది. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జయింది. ఈ బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలకు గురైన వారిని సమీప ఆస్పత్రిలో చేర్చారు. మృతులను హనుమకొండలోని బాలసముద్రానికి చెందిన నవజీత్ సింగ్, హైదరాబాద్ దోమలగూడకు చెందిన ఓం ప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.

