అప్పుల బాధ తాళలేక ఉపాధ్యాయుడి బలవర్మణం
x

అప్పుల బాధ తాళలేక ఉపాధ్యాయుడి బలవర్మణం

మేడ్చెల్ లో ఓ లాడ్జి సెల్ఫీ వీడియో తీసుకుని...


మేడ్చల్‌లో ఉపాధ్యాయుడు బలవర్మణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీశాడు. మృతుడు మెదక్‌ పట్టణానికి చెందిన కాముని రమేశ్‌గా పోలీసులు గుర్తించారు.

అప్పులు తీర్చేసినప్పటికీ ఇంకా కొందరు వడ్డీ బాకీ ఉన్నావంటూ కొందరు వేధిస్తున్నారని రమేశ్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు. చెక్‌ బౌన్స్‌ కేసులు వేసి మానసికంగా చిత్ర హింసలు పెడుతున్నారని ఆయన సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. భార్యాపిల్లలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. తన మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తన భార్య, పిల్లలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌కు విజ్ఞప్తి చేశారు.

Read More
Next Story