నిరుద్యోగులను అరెస్ట్ చేయడం దుర్మార్గం: కెటిఆర్
x

నిరుద్యోగులను అరెస్ట్ చేయడం దుర్మార్గం: కెటిఆర్

ఛలో సెక్రెటేరియట్ భగ్నం


నిరుద్యోగులు ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి నగరానికి వస్తున్న నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. నిరుద్యోగులు ఛలో సెక్రటేరియట్ ను పోలీసులు భగ్నం చేశారు.

శుక్రవారం బిఆర్ఎస్ నేతృత్వంలో ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పోలీసులు నిరుద్యోగులను అరెస్ట్ చేయడాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల కోసం సచివాలయం ఎప్పటికీ తెరచే ఉంటుందని చేసిన ప్రకటన గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదని, సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేసిందన్నారు.

అశోక్ నగర్ కు రాహుల్ ను పిలిచి ఛాయ్ పే చర్చ పెట్టిన రాహుల్ నిరుద్యోగులను మోసం చేశాడని కెటిఆర్ అన్నారు. అధికారంలోవచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి జాబ్ క్యాలెండర్ గుర్తుకు రాలేదా అని కెటిఆర్ ప్రశ్నించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నిరుద్యోగులు కూడా ఓ కారణం. బిఆర్ఎస్ ఓడిపోవడానికి నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత నిరుద్యోగులు మొదటి సారి నిర్వహించిన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేయడాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తున్నాయి.

Read More
Next Story