కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’  పెద్ద స్కాం
x

'కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పెద్ద స్కాం'

"కాంగ్రెస్ నేతలు భూములు కొనుగోలు చేశాకే ఇపుడ ముచ్చర్లను ఫోర్త్ సిటి చేస్తామంటున్నారు."


కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు.
"గత ప్రభుత్వంలో ధరణి పేరుతో దాదాపు రూ.2 లక్షల కోట్ల స్కాం జరిగింది. దేశంలోనే అతిపెద్ద స్కాం ధరణి . ఇపుడు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమై ఫోర్త్ సిటి అని ప్రకటించారు," బండి అన్నారు.
ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో బోనాల ఉత్సవాలకు హాజరైన బండి సంజయ్ కుమార్ చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, రాష్ట్ర నాయకులు అందెల శ్రీరాములు యాదవ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మూడు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఫోర్త్ సిటి గురించి ప్రస్తావించారు. మొన్న అసెంబ్లీ లో ప్రసంగిస్తూ ముచ్చర్ల ను హైదరబాద్, సికిందరాబాద్ , సైబరాబాద్ మాదిరిగా మరొక నాలుగో సిటీ మారుస్తామని, అది న్యూయార్క్ ను మించిపోతుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు బండి స్పందించారు.
"మహేశ్వరం ను ఫోర్త్ సిటీగా మారుస్తామనే సర్కార్ ప్రకటన వెనుక పెద్ద భూదందా నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను అగ్గువకు కొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నరు. గతంలో బీఆర్ఎస్ ధరణి భూదందాతో వేల కోట్ల ఆస్తులను పోగేసుకుంది. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదు పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించేందుకు భూ దందాను తెరపైకి తేవడమే కాకుండా మహేశ్వరం కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారు," అని అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ శివారులోని 33 గ్రామపంచాయతీలు, 20 పురపాలక సంఘాలు, 8 కార్పొరేషన్లు, 61 పారిశ్రామిక వాడలు, కంటోన్మెంట్ బోర్డు.. వీటన్నింటినీ గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన అర్ధం లేనిది. ప్రజలపై పన్నుల భారం మోపేందుకే విలీన కుట్ర చేస్తున్నారు. 15 ఏళ్ల కిందట హైదరాబాద్ శివారులోని విలీనమైన ప్రాంతాలు ఇప్పటికీ అభివ్రుద్ధికి నోచుకోలేదు. వాటిని అభివ్రుద్ది చేయకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలను విలీనం చేస్తామనడం అర్ధం లేనిది. దీనిపై బీజేపీ నాయకత్వం చర్చించి తగిన కార్యాచరణను ప్రకటిస్తుంది.





Read More
Next Story