తెలంగాణలో పండుతోంది యూరియా వరి
x

తెలంగాణలో పండుతోంది యూరియా వరి

బిజెపి ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు


తెలంగాణలో యూరియా వరి పండుతోందని బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. రైతులు వరి సాగు చేయొద్దని ఆయన సూచించారు. మన రాష్ట్రంతో బాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు భారీగా వరి పండిస్తున్నాయన్నారు. అన్నం తినే వారి సంఖ్యతో పోలిస్తే వరి పంట విస్తీర్ణం బాగా పెరిగిందన్నారు. వరి పంట విస్తీర్ణం పెరగడం వల్ల డిమాండ్ బాగా తగ్గిపోయిందని అన్నారు. మన దగ్గర తినే వారు కరువయ్యారు. వరి పంటకు వినియోగించే యూరియా కారణంగా ఎగుమతులు కూడా తగ్గిపోయాయన్నారు. మనం వరికి బదులుగా యూరియా వరి పండిస్తున్నామన్నారు. తెలంగాణలో యూరియా వినియోగం దేశంలోనే నెంబర్ వన్ అని కొండా అన్నారు. కెసీఆర్ హాయం నుంచి వరి పంట సాగు పెరిగిందని బిఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. తెలంగాణకు 40 లక్షల టన్నుల వరి బియ్యం అవసరమైతే 2 కోట్ల టన్నులను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. కాళేశ్వరం వల్లే వరి సాగు పెరిగిందని బిఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయని, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అంతటా వరి సాగు పెరగడంతో ధరలు పడిపోయాయన్నారు. ఆర్థిక కారణాల వల్ల రైతు గత్యంతరం లేకే వరి పండిస్తున్నాడని కొండా అన్నారు. వరికి బదులుగా మిల్లెట్స్ పండించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు.

హైడ్రా పనితీరు బాగాలేదు

హైడ్రా పని తీరును బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తప్పు పట్టారు ఎంఐఎంకు భయపడి ఫాతిమా కాలేజి జోలికి హైడ్రా వెళ్లడం లేదన్నారు. పేద హిందువుల ఇళ్లను హైడ్రా కూల్చేస్తుందన్నారు.అక్రమ కట్టడాలను కూల్చాల్సిన హైడ్రా రాజకీయాలు మాట్లాడుతుందన్నారు.

Read More
Next Story