రాష్ట్రంలో యూ-ట్యాక్స్ దుమారం...
x

రాష్ట్రంలో 'యూ-ట్యాక్స్' దుమారం...

తెలంగాణలో యూ-ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.


తెలంగాణలో యూ-ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సీఎం పదవి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రూ. వంద కోట్లు చేరవేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.

నాపై మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నేను దైవదర్శనం కోసం కుటుంబంతో కలిసి వేరే రాష్ట్రానికి వచ్చాను. రేపు సాయంత్రం హైదరాబాద్ కి వచ్చాక మహేశ్వర్ రెడ్డి ఆరోపణలకు సరైన జవాబు చెబుతాను" అంటూ ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు.

సీఎం రేసులో ఉన్నాను అనిపించుకోడానికే...

మంగళవారం హైదరాబాద్ నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు మోడీతో సహా రాష్ట్ర బీజేపీ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపిస్తూ వచ్చారు. వసూలు చేసినదాంట్లో సగం రేవంత్ రెడ్డికి వెళ్తుంటే ఇంకో సగం రాహుల్ గాంధీకి వెళ్తోందంటూ ఆరోపణలు చేస్తుండగా రాష్ట్రంలో యూ-ట్యాక్స్ వసూలు చేయడం మొదలుపెట్టారని ఏలేటి ఆరోపించారు. రాష్ట్రంలో రూ.500 కోట్లు చేతులు మారగా అందులో రూ.100 కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేసులో ఎక్కడ వెనుకబడతానో అనే భయంతో, తాను కూడా సీఎం రేసులో ఉన్నాను అనిపించుకోడానికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా చేశారని ఆరోపించారు.

"ఆయన తోటి మిత్రులు ఢిల్లీ పెద్దలకు డబ్బులు ఇచ్చి ముందుకు వెళ్తుండటంతో భయపడి ఉత్తమ్ ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా? దీనికి మంత్రి బాధ్యత వహిస్తారా? అధికారులు బాధ్యత వహిస్తారా? సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్ కి వ్యవసాయం గురించి తెలియదనకుంటా. రైతులకు డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లకు సంబంధించిన డేటా ఉందా? డిఫాల్టర్ల వివరాలు ఉన్నాయా? లేవా? సీఎం రేవంత్ దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మేము ఈ తప్పులను నిరూపిస్తాం. ఇది సామాన్యుల రక్తాన్ని తాగే కుంభకోణం. స్టాక్ రైస్ మిల్లర్ల వద్ద ఉంటే ప్రభుత్వం వడ్డీ ఎందుకు కట్టాలి? ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా?" అంటూ మాహేశ్వర్ రెడ్డి నిలదీశారు.

Read More
Next Story