ప్రఖ్యాత వైద్యులకు వైద్యరత్న అవార్డులు
x

ప్రఖ్యాత వైద్యులకు 'వైద్యరత్న' అవార్డులు

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని జులై 1 న శ్రీరామానుజ సేవా ట్రస్ట్ వైద్యులను సత్కరించబోతోంది.


అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని జులై 1 న హైదరాబాద్ మౌలాలి లోని శ్రీరామానుజ సేవా ట్రస్ట్ వైద్యులను సత్కరించబోతోంది. ఈ సంవత్సరం పదకొండు మంది ప్రఖ్యాత వైద్యులకు "వైద్యరత్న" పురస్కారం అందివ్వనుంది. తెలంగాణ గవర్నర్ సీ.పి.రాధాకృష్ణన్ అధికారిక నివాసం (రాజ్ భవన్) లో.. వారి చేతుల మీదుగా డాక్టర్లకు "వైద్యరత్న" అవార్డు ప్రదానం చేయనున్నట్లు డాక్టర్ ధనుంజయ వెల్లడించారు.

పురస్కార గ్రహీతలు:


1) ప్రొఫెసర్ డా.పి.బాలంబ,

ప్రముఖ సీనియర్ స్త్రీల వైద్యనిపుణురాలు


2) ప్రొఫెసర్ డా.ఏం.శ్రీనివాసులు,

ప్రముఖ క్యాన్సర్ శస్త్ర వైద్య నిపుణులు, డైరెక్టర్ ఎం.ఎన్.జె క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్.


3) డా.పి.రఘు రామ్,

రొమ్ము క్యాన్సర్‌ వైద్య నిపుణులు, పద్మ శ్రీ, డా.బి.సీ.రాయ్ అవార్డు గ్రహీత, 2022 మార్చిలో బ్రిటీష్‌ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ లభించింది.


4) డా.రాజేంద్రనాథ్,

నేత్ర వైద్య నిపుణులు, సూపరింటెండెంట్ కింగ్ కోఠి హాస్పిటల్, హైదరాబాద్.


5) డా.ఏ.వి.ఎస్.సురేష్,

ప్రముఖ కన్సల్టెంట్ మెడికల్ ఓంకాలజిస్ట్, చీఫ్ ఆఫ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ కాంటినెంటల్ హాస్పటల్, హైదరాబాద్.

6) డా.ఆచి మోహన్,

ప్రముఖ లాప్రోస్కోపిక్ జనరల్ సర్జన్, మాధవ నర్సింగ్ హోమ్ సికింద్రాబాద్.

7) డా.కె.కృష్ణ కిరణ్,

ప్రముఖ రోబోటిక్ క్యాన్సర్ సర్జన్

8) ప్రొఫెసర్ డా.ఇయ్యుని రాధేశ్యాం,

ప్రముఖ ఎముకల శస్త్ర వైద్య నిపుణులు.

9) డా.ఆర్.నరేందర్,

ప్రముఖ పిల్లల వైద్యులు, సివిల్ సర్జన్

10) డా.బి.జ్యోతి,

స్త్రీల వైద్య నిపుణురాలు, Ferty9 ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ డైరెక్టర్, హైదరాబాద్

11) డా.జి.రవీందర్ రెడ్డి,

ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు.


Read More
Next Story