హన్మకొండ సిద్ధేశ్వరాలయంలో ఆత్మార్పణ శిలలు
x

హన్మకొండ సిద్ధేశ్వరాలయంలో ఆత్మార్పణ శిలలు

ఒక ఏనుగుపై అంబారీ, మావటీడు, కింద ఛత్రంతో భటుడు, ఎదురుగా వీరుడు కంఠంలో కత్తితో పొడుచుకుని ఉండటం ఈ మెమోరియల్ శిల మీద చూడవచ్చు.


హన్మకొండ సిద్ధేశ్వరాలయ ప్రాంగణంలో కొత్త తెలంగాణచరిత్రబృందం రెండు ఆత్మార్పణశిలలను గుర్తించింది. ఈ బృందంలోని పరిశోధక సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ వీటిని కనుగొన్నాడు.

హన్మకొండ సిద్ధేశ్వరాలయం చారిత్రకంగా ప్రసిద్ధమైంది. సిద్ధులగుట్టలోని గుహల్లో శైవసిద్ధులు, తాంత్రికులు తపస్సు చేస్తుండేవారంటారు. సిద్ధులమఠం సిద్ధేశ్వరాలయం చాలావరకు కాకతీయశైలిలో కనిపిస్తుంది. కాని, గుడి ప్రాంగణంలో కనిపిస్తున్న కొన్ని పురాతన శిల్పాలున్నాయి.



గుడిలో వున్న విడిశిల్పాలలో నంది ముందు రెండు వీరగల్లున్నాయి. ఇవి రెండు ఏనుగులతో కనిపించే విశేషశిల్పాలు. వీటిలో వీరులు తమ కంఠాలను కత్తులతో ఉత్తరించుకుంటున్నారు. వారికి రాజలాంఛనాలైన ఛత్రాలుపట్టి వుండడంవల్ల వారు రాచకుటుంబీకులై శివసాయుజ్యంకోరి ఆత్మార్పణలు చేసుకుంటున్నారనిపిస్తుందని కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.

"ఒక ఏనుగుపై అంబారీ, మావటీడు, కింద ఛత్రంతో భటుడు, ఎదురుగా వీరుడు కంఠంలో కత్తిపొడుచుకుని కనిపిస్తున్నాడు. రెండవ వీరగల్లులో వీరుడు ఒకచేత్తో ఏనుగుతొండాన్ని పట్టుకుని, ఎడమచేత్తో కంఠం కత్తితో కోసుకుంటున్నాడు. ఇటువంటి వీరగల్లులు ముందెన్నడు తెలంగాణాలో కనిపించలేదు," అని హరగోపాల్ తెలిపారు.



Read More
Next Story