కాళేశ్వరం అవినీతిపై కదిలిన విజిలెన్స్
x
మేడిగడ్డ ప్రాజెక్ట్‌

కాళేశ్వరం అవినీతిపై కదిలిన విజిలెన్స్

బాహుబలి కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి కూడా బలంగానే ఉందన్న కాంగ్రెస్‌ నాయకులు.. ఇప్పుడు దాన్ని నిరూపించేందుకు సిద్ధమయ్యారు. విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించారు


కాళేశ్వరం అవినీతిపై రేవంత్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇరిగేషన్ ENC కార్యాయలంలో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగ్‌డ్రాఫ్ట్‌లో బాహుబలి అవినీతి తేలింది. బాహుబలి మోటార్స్ విషయంలో కాంట్రాక్టర్లకు రూ.5,188 కోట్లు అదనంగా పేమెంట్ చేసినట్టు తేలింది. బాహుబలి మోటర్లక Bhelకు చెల్లించింది 16వందల86 కోట్లు కాగా, కాంట్రాక్టర్ లు లెక్క చూపింది 7వేల214 కోట్లు. కాగ్ డ్రాఫ్ట్ ప్రకారం మేఘ, lఅండ్ t, నవయుగకు 7,వేల 500 కోట్ల లబ్ది చేకూర్చినట్టు గుర్తించింది.

కొనసాగుతున్న సోదాలు...


హైదరాబాద్‌లోని నీటి పారుదల శాఖ కార్యాలయం జలసౌధలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని అన్ని ఫ్లోర్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అధికారులు, సిబ్బందికి చెందిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అన్ని ఫైల్స్, రికార్డులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. కాళేశ్వరం జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇరిగేషన్‌ కార్యాలయంపై విజిలెన్స్‌ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాగ్‌ నివేదిక రిపోర్ట్‌ ఆధారంగా...


CAG డ్రాఫ్ట్ నివేదికలో పలు అంశాలను పేర్కొన్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీలకు ప్రాధాన్యత ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పంప్ సెట్స్‌, మోటర్స్ సరఫరాకు సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ.5 వేల కోట్లకు పైగా అదనపు చెల్లింపులు జరిగాయని CAG డ్రాఫ్ట్‌ రిపోర్టులో ప్రస్తావించింది. కేవలం నాలుగు ప్యాకేజీల్లోనే ఈస్థాయిలోఅదనపు చెల్లింపులు జరిపితే మిగిలిన ప్యాకేజీల్లో మరెంత డబ్బు కృష్ణార్పణం అయిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత లోపం కంటే పంప్‌సెట్లకి అదనపు చెల్లింపుల్లోనే భారీ మోసం జరిగిందని అంటున్నారు. CAG డ్రాఫ్ట్ నివేదికను తొక్కి పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయి నివేదిక వస్తే మరెన్నో సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు డిజైన్, ఖర్చు అంచనాల తయారీలో కాంట్రాక్టర్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో కాళేశ్వరం రింగ్‌మాస్టర్‌ కాంట్రాక్టర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పంప్‌హౌస్‌ మోటర్ల సరఫరాలో భారీ అవినీతి జరిగిందని మంత్రి కోమటిరెడ్డి బహిరంగగానే ఆరోపించారు.

కరీంనగర్‌లోనూ విజిలెన్స్‌ తనిఖీలు...

అటు కరీంనగర్‌లోనూ విజిలెన్స్‌ తనిఖీలు జరుగుతున్నాయి. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. మహదేవ్‌పూర్‌ ప్రాజెక్టు కార్యాలయంలోనూ విజిలెన్స్‌ తనిఖీలు సాగుతున్నట్టు తెలుస్తోంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు రూపొందించింది ఎవరనే దానిపై విజిలెన్స్‌ ఆరా తీస్తున్నట్టు సమాచారం.

Read More
Next Story