వికారాబాద్ కోతుల సమస్య ఇకనైనా పరిష్కారమయ్యేనా?
x
పార్లమెంటులో మాట్లాడుతున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ఫొటో : లోక్ సభ టీవీ సౌజన్యంతో)

వికారాబాద్ కోతుల సమస్య ఇకనైనా పరిష్కారమయ్యేనా?

కోతుల దాడులతో వికారాబాద్ రైతుల పంటలు దెబ్బతింటున్నాయని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురువారం పార్లమెంటులో చెప్పారు.


వికారాబాద్‌ జిల్లాలో కోతులు పంటల్ని ధ్వంసం చేస్తూ, రైతుల ఆశలు చంపేస్తున్నాయి. కోతులు, అడవిపందులు రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమస్యను తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి లోక్‌ సభలో గట్టిగా లేవనెత్తి...కేంద్రం ఈ సమస్యను దృష్టిలోకి తీసుకుని ఒక నోడల్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.




లోక్ సభలో గళమెత్తిన ‘కొండా’

చేవేళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన నియోజకవర్గ కోతుల సమస్యపై గురువారం లోక్ సభలో గళమెత్తారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వికారాబాద్ జిల్లాలో పంట పొలాలపై కోతుల దండు దాడి చేసి పంటలను నాశనం చేస్తున్నాయని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గురువారం లోక్ సభలో ప్రస్థావించారు. తమ ప్రాంతంలో కోతుల సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను తీర్చి మా వికారాబాద్ జిల్లాలో రైతులను ఆదుకోవాలని ఎంపీ కోరారు.

కోతుల సమస్య నివారణలో అటవీశాఖ డీఎఫ్ఓ, వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ తమకు సంబంధం లేదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. కోతుల సమస్య జాతీయ స్థాయి పెద్ద సమస్య అని, కోతులతోపాటు అడవి పందులు, నీలుగాయిలను నియంత్రించి రైతుల పంటలు దెబ్బతినకుండా చూడాలని ఎంపీ కొండా డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో కోతులది అర్జంట్ సమస్య అని దీనిపై మాట్లాడేందుకు ఒక్క నిమిషం సమయం ఇవ్వండి స్పీకర్ సార్ అంటూ ఎంపీ కొండా కోరారు. కోతుల సమస్యను పార్లమెంటు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నోడల్ మినిస్ట్రీని నియమించాలని కోరారు.

కోతుల సమస్య జాతీయ సమస్య అని, వికారాబాద్ జిల్లాలో కోతులు పంటలను దెబ్బతీస్తూ, రైతుల జీవనోపాధిని నాశనం చేస్తున్నాయని కొండా చెప్పారు. ‘‘నేను కోతుల విషయాన్ని ఈ రోజు పార్లమెంటులో లేవనెత్తాను. ఇది తెలంగాణలో మాత్రమే కాదు, చాలా రాష్ట్రాల్లోనూ సమస్య అని తేలింది. పార్టీలకు అతీతంగా చాలా మంది ఎంపీలు ఈ అంశంపై అంగీకరించడమే కాకుండా, నాకు మద్దతు ఇచ్చారు.ఈ సమస్యకు ఏ ఒక్క శాఖ లేదా మంత్రిత్వ శాఖ బాధ్యత వహించదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నోడల్ మంత్రిత్వ శాఖ , జాతీయ మార్గదర్శకం అవసరం.ప్రతి రాష్ట్రం సమస్యను వేరే విధంగా పరిష్కరిస్తుంది,కొన్ని రాష్ట్రాలు ఏమీ చేయవు... రైతులను తమను తాము రక్షించుకునేలా వదిలివేస్తాయి.’’అని కొండా పేర్కొన్నారు. ఇప్పుడు వికారాబాద్ రైతులు ఎదుర్కొంటున్న కోతుల సమస్య లోక్‌సభ దృష్టికి వెళ్లింది.ఇక వికారాబాద్ కోతుల సమస్యను ఎవరు పరిష్కరిస్తారనేంది వేచి చూడాల్సిందే.


Read More
Next Story