కవితతో  విష్ణువర్దన్ రెడ్డి భేటి
x

కవితతో విష్ణువర్దన్ రెడ్డి భేటి

రోజుకో మలుపు తిరుగుతున్న జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక


జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. సోమవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పిజెఆర్ తనయుడు, జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్దన్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లిహిల్స్ ను తిరిగి నిలబెట్టుకోవాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

2008లో పిజెఆర్ మరణానంతరం కొత్తగా ఏర్పాటైన జూబ్లిహిల్స్ నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న విష్ణువర్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో 2, 80, 236 వోట్ల తేడాతో గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగుంట గోపినాథ్ చేతిలో వరుసగా ఓటమి పాలయ్యారు. తన ఓటమికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని అప్పట్లో పార్టీని నిందించారు. పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో విష్ణువర్దన్ రెడ్డి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు టికెట్ దక్కకపోవచ్చనే అనుమానంతో బిఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఆయనకు మొండి చేయి చూపింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే గోపినాథ్ కు బిఆర్ ఎస్ టికెట్ దక్కింది . మాగంటి వరుసగా మూడుసార్లు బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కెసీఆర్ కోరికమేరకు విష్ణువర్దన్ రెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ తరపున ప్రచారం చేయడమే గాక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ను ఓడగొట్టడంలో ముఖ్య భూమిక వహించారు. కాంగ్రెస్ కేడర్ కూడా మాగంటి గోపినాథ్ విజయానికి దోహదపడింది.

గుండెపోటుతో మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవితతో విష్ణువర్దన్ రెడ్డి భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.జూబ్లిహిల్స్ బిఆర్ఎస్ టికెట్ కోసం విఫలయత్నం చేసిన పి. విష్ణువర్దన్ రెడ్డి ఈసారి కూడా టిక్కెట్ దక్కకపోవడంతోనే కవితతోనే అరగంటకు పైగా మాట్లాడినట్టు సమాచారం.

రంగంలో దిగిన కేటిఆర్

మరో వైపు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు రంగంలో దిగారు. మాగంటి గోపినాథ్ సతీమణి సునీత పేరు దాదాపు ఖరారు కావడంతో నియోజకవర్గంలో బిఆర్ఎస్ శ్రేణులతో సమావేశమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ అజారుద్దీన్ పేరు వినపడినప్పటికీ ప్రస్తుతం ఎన్నికల బరిలో లేరు. తాను జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్ పేరు అనౌన్స్ అయ్యింది. జూబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది సస్పెన్స్ కొనసాగుతుంది.


Read More
Next Story