కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు..
x

కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు..

రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు కోరారు. కాగా అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు.


బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరయింది. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో శనివారం కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను వరంగల్ కోర్టుకు తరలించారు. ఆయనను రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు కోరారు. కాగా అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణకు పూర్తి సహకారం అందించాలని తెలిపింది. కాగా కోర్టు విచారణలో.. 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు.

Read More
Next Story